Warangal: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో Cyclothan పోటీలు

ABN , First Publish Date - 2022-06-26T16:09:15+05:30 IST

పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆదివారం ఉదయం సైక్లోథాన్ (Cyclothan) పోటీలు ప్రారంభమయ్యాయి.

Warangal: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో Cyclothan పోటీలు

వరంగల్ (Warangal) జిల్లా: పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆదివారం ఉదయం సైక్లోథాన్ (Cyclothan) పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, సీపీ తరుణ్ జోషీ, వరంగల్ కలెక్టర్ గోపీ, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు. సైక్లోథాన్ పోటీల్లో భాగంగా సీపీ తరుణ్ జోషీ, వరంగల్ కలెక్టర్ గోపీ, అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి స్టెప్పులేశారు.


అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,  అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ సైక్లోథాన్‌- 2022 సైక్లింగ్‌ పోటీలు జరుగుతున్నాయి. వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి ప్రత్యేక ఆసక్తితో ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకరమైన సమాజం కోసం వరంగల్‌ వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 


మూడు రకాలు 

సైక్లింగ్‌ పోటీల్లో 25 కిలోమీటర్ల ఫుల్‌రేస్‌, 15 కిలోమీటర్ల ఫన్‌రేస్‌, 5 కిలోమీటర్ల కిడ్స్‌ రేస్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నా రు. కమిషనరేట్‌ కార్యాలయం నుంచి కాళోజీ జంక్షన్‌, అదాలత్‌, ఎన్‌ఐటీ, కాజీపేట, మడికొండ, రాంపూర్‌ సమీపంలోని సత్యసాయి కన్వెన్షన్‌ వరకు ఈ పోటీలు సాగుతాయి. మడికొండ నుంచి తిరిగి కమిషనరేట్‌ కార్యాలయం వరకు 25 కిలోమీటర్ల దూరం పూర్తవుతుంది. పోటీలో పాల్గొనేందుకు శనివారం రాత్రి 8 గంటల వరకు కమిషనరేట్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 500 మంది సైక్లి్‌స్టలు ఆన్‌నైల్‌లో ఎంట్రీలు సమర్పించారు. 

Updated Date - 2022-06-26T16:09:15+05:30 IST