వరంగల్: పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, దళితులకు మూడెకరాల భూపంపిణీ చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హన్మకొండ ఏకశిల పార్క్ నుంచి ర్యాలీ చేపట్టారు. సీపీఐ నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు తోపులాట స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.