వరంగల్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-01-16T13:00:52+05:30 IST

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం అయ్యింది.

వరంగల్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం అయ్యింది. ఎంజీఎంలో టీకా కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్  ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో 630 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 4 జిల్లా ఆస్పత్రులు, 2సీఎస్ఈలు, 11పీహెచ్ సీలు, 4 ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు టీకాలు ఇవ్వనున్నారు. ఒక్కో కేంద్రంలో 30మందికి టీకాలు వేయనున్నారు.

Updated Date - 2021-01-16T13:00:52+05:30 IST