వరంగల్: ఎంజీఎంలో ఆగని కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-08-02T13:48:48+05:30 IST

వరంగల్: ఎంజీఎంలో ఆగని కరోనా మరణాలు

వరంగల్: ఎంజీఎంలో ఆగని కరోనా మరణాలు

వరంగల్ అర్బన్: ఎంజీఎంలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. ఎంజీఎంలోని ల్యాబ్‌లో విధులు నిర్వహిస్తున్న ఖుర్షీద్ అనే సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు కోవిడ్ వార్డులో సరైన వైద్య సేవలు అందక కరోనా బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.  పట్టించుకునే వారులేకపోవడం, ఆర్ఎమ్‌వో స్పందించకపోవడంతో రోగులు అవస్థలకు గురవుతున్నారు. సరైన వైద్యం అందక  కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరు కరోనా రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. 12మంది డ్యూటీ డాక్టర్లు, మెడికల్ కిట్లు లేవని, వసతులు కలిపించాలని ఆందోళనకు దిగారు. పట్టించుకునే వారు లేక ఎక్కడ వారి అక్కడే ఇబ్బందులు పడుతున్న వైనం నెలకొంది. సూపరింటెండెంట్ రాజీనామా చేసి వారం దాటినా ఇంకా ఆస్థానాన్ని  ప్రభుత్వం భర్తీ చేయలేదు. కరోనా సమయంలో సమన్వయ పరిచే అధికారి లేక ఎంజీఎంలో ఆగమాగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

Updated Date - 2020-08-02T13:48:48+05:30 IST