న్యూయార్క్ సిటీ: కన్న కూతురు కోసం ఓ ఆర్మీ జవాన్ అనితర సాధ్యానికి పూనుకున్నాడు. అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న ఆమెను ఎలాగైనా రక్షించుకోవాలనే ఉక్కు సంకల్పంతో ఏకంగా 12 వందల మైళ్లు(1900 పైగా కిలోమీటర్లు) నడిచాడు. ఇంకా నడుస్తున్నాడు. బ్రాన్నింగ్-హెంగమే దంపతుల కుమార్తె హస్తి. ఆమె పుట్టినప్పుడే డాక్టర్లు ఓ షాకింగ్ విషయాన్ని తల్లిండ్రులకు తెలిపారు. హస్తి అరుదైన వ్యాధి అయితే కోర్నెల్లా డీ లాన్గే సిండ్రోమ్(సీడీఎల్ఎస్)తో బాధపడుతోందని చెప్పారు.
సీడీఎల్ఎస్ వ్యాధి ప్రతి 20వేల మంది ఒకరికి మాత్రమే వస్తుందని, దీనికి ఎలాంటి చికిత్స లేదని చెప్పడంతో బ్రాన్నింగ్ దంపతులకు ప్రపంచం మొత్తం చీకటైనట్లనిపించింది. ఇది వంశపారంపర్యం కాదని, కానీ జన్యులోపం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుందని, ఈ వ్యాధి బారిన పడిన వారు శారీరకంగానే కాకుండా వారి ప్రవర్తనలో వివిధ రకాల సమస్యలను ఏర్పడతాయని వైద్యులు వెల్లడించారు.
కానీ బ్రాన్నింగ్ దంపతులు తమ కుమార్తెను కోల్పోకూడదని నిర్ణయించుకున్నారు. ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఎలాగైనా ఈ వ్యాధిపై పరిశోధనలు జరిగి, త్వరగా చికిత్స కనిపెట్టేందుకు అవసరమైన రీసెర్చ్ కోసం ‘హోప్ ఫర్ హస్తి’ పేరుతో ఓ చారిటీని స్థాపించి క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే వట్టికాళ్లతో దేశం మొత్తం తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నాడు.
ఈ విరాళాల ద్వారా మరీన్ ప్రాంతంలోని జాక్సన్ ల్యాబోరేటరీలో సీడీఎల్ఎస్ చికిత్స కోసం జీన్ థెరపీపై రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ జీన్ థెరపీకి ఆమోదం లేదు. అయితే దీని ద్వారా ఈ వ్యాధిని తగ్గించవచ్చనే నమ్మకంలో శాస్త్రవేత్తలు ఉన్నారు.
41 ఏళ్ల క్రిస్ బ్రాన్నిగన్.. శనివారం న్యూయార్క్ చేరుకున్నాడు. నార్త్ కరోలినాలోని మరీన్ టూ మరీన్ బేజ్ క్యాంప్ లెజీనే నుంచి తన ప్రయాణం మొదలు పెట్టిన బ్రాన్నిగన్ 25 రోజుల ప్రయాణం అనంతరం 12వందల కిలోమీటర్లు నడిచి న్యూయార్క్ చేరుకున్నాడు. దేశం మొత్తం తిరుగుతూ తన కూతురు వైద్యం కోసం బ్రాన్నింగ్ విరాళాలు సేకరిస్తున్నాడు.
దాదాపు 3.5 మిలియన్ డాలర్లు(రూ.26కోట్ల వరకు) సేకరించాలనేది అతడి ఆలోచన. ఇక తన కూతురు గురించి మాట్లాడుతూ.. ఈ వ్యాధి వల్ల హస్తి పెరుగుదల తగ్గిందని, నేర్చుకునే సామర్థం దెబ్బతిన్నదని, ముర్ఛ బారిన కూడా పడుతోందని, ఆమెను ఎలాగైనా కాపడుకోవాలనే ఈ సాహసాన్ని మొదలు పెట్టానని బ్రాన్నింగ్ చెప్పుకొచ్చాడు.