వార్‌ వన్‌సైడ్‌

ABN , First Publish Date - 2022-09-28T05:21:15+05:30 IST

మదర్‌ డెయిరీలో ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ఏకపక్షంగా సాగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ఎస్‌వీ కన్వెన్షన్‌లో మంగళవారం ఉదయం 8 గంటల నుం చి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించారు.

వార్‌ వన్‌సైడ్‌
మదర్‌ డెయిరీ ఎన్నికల్లో గెలుపొందిన డైరెక్టర్లను అభినందిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

 మదర్‌ డెయిరీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఘన విజయం

 భారీ మెజార్టీతో ముగ్గురి గెలుపు

 ఆలేరు నియోజకవర్గానికే చైర్మన్‌గిరి

 నేడు చైర్మన్‌ను ఎన్నుకోనున్న డైరెక్టర్లు

 మంత్రి జగదీ్‌షరెడ్డి ఆశీస్సులెవరికో?

మదర్‌ డెయిరీలో ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ఏకపక్షంగా సాగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ఎస్‌వీ కన్వెన్షన్‌లో మంగళవారం ఉదయం 8 గంటల నుం చి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించారు.

- (ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

మదర్‌ డెయిరీలో మొత్తం 15మంది డైరెక్టర్లు ఉండగా, మూడు ఖాళీ అయ్యాయి. వీటికోసం నిర్వహించిన ఎన్నికల్లో ఐదుగురు పోటీపడ్డారు. ఏకగ్రీవంగా డైరెక్టర్లను ఎన్నుకోవాలని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రయత్నించినా కాంగ్రెస్‌, బీజే పీ సహకరించలేదు. రెండు పార్టీలు ఒక్కో అభ్యర్థి చొప్పున ఇద్దరిని పోటీలో నిలపడంతో ఎన్నికలు అనివార్యమయ్యా యి. ఈఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీమెజార్టీతో విజ యం సాధించారు. మొత్తం అయిదుగురు అభ్యర్థులు బరి లో నిలవగా, అధికార పార్టీ నుంచి పోటీలో నిలిచిన భువనగిరి నియోజకవర్గానికి చెందిన కస్తూరి పాండుకు 249ఓట్లు, ఆలేరు నియోజకవర్గానికి చెందిన గొల్లపల్లి రాంరెడ్డికి 239 ఓట్లు, నకిరేకల్‌ నియోజకవర్గానికి చెందిన మందడి ప్రభాకర్‌రెడ్డికి 204ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన ఆలేరు నియోజకవర్గం షారాజ్‌పేట చెందిన బత్తుల నరేందర్‌రెడ్డికి కేవలం 65 ఓట్లు, బీజేపీ తరఫున పోటీచేసిన ఆలేరు నియోజకవర్గం రాఘవపురం గ్రామానికి ఎస్‌.వెంకటనర్సింహారెడ్డికి 53 ఓట్లు మాత్రమే వచ్చాయి.


వ్యూహాత్మకంగా వ్యవహరించిన గొంగిడి

మదర్‌ డెయిరీ ఎన్నికల్లో టెస్కాబ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి వ్యూ హాత్మకంగా వ్యవహరించారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి మునుగోడు ఉప ఎన్నిక బిజీతో పాటు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కార్యకర్తలను, నాయకులను నిత్యం కలుస్తున్న నేపథ్యంలో మదర్‌ డెయిరీ ఎన్నికల బాధ్యతను గొంగిడి మహేందర్‌రెడ్డికి మంత్రి అప్పగించారు. దీంతో మహేందర్‌రెడ్డి అన్ని తానై వ్యవహరిస్తూ ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని అభ్యర్థుల ఘనవిజయానికి కృషి చేశారు. గతంలో మదర్‌ డెయిరీ ఎన్నికలంటే ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో క్యాంపులు నిర్వహించాల్సి వచ్చేది. ఈ సారి అలాంటివేవీ లేకుండా అధికా రపార్టీ టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా పావులు కదిపి ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంలో మహేందర్‌రె డ్డి కీలకంగా పనిచేశారు. దీంతో ఆయన్ను మంత్రి జగదీ్‌షరెడ్డి అభినందించినట్లు సమాచారం.


పదవి ఎవరికి దక్కేనో?

విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి సూచించిన వ్యక్తికే మదర్‌ డెయిరీ చైర్మన్‌ పదవి దక్కనుంది. మదర్‌ డెయిరీలో మొత్తం 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరంతా కొత్త చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఆలేరు నియోజకవర్గానికే చైర్మన్‌ పదవి దక్కనుండడంతో ఆ నియోజకవర్గంలోని కొలనుపాకకు చెందిన దొంతిరి సోమిరెడ్డి, మోటకొండూరుకు చెందిన శ్రీకర్‌రెడ్డి, రాజాపేటకు చెందిన వెంకట్‌రాంరెడ్డి చైర్మన్‌ పదవి కోసం పోటీపడుతున్నారు. ఈ ముగ్గురిలో మంత్రి జగదీ్‌షరెడ్డి ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనేది రాజకీయంగా చర్చ సాగుతోంది. చైర్మన్‌ ఎంపికపై డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డితో మంగళవారం రాత్రి చర్చించిన అనంతరం మంత్రి జగదీ్‌షరెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. బుధవారం ఉదయం 11గంటలకు చైర్మన్‌ ఎన్నిక జరిగే సమయం వరకు అభ్యర్థి ఎవరనేది గోప్యంగా ఉంచే అవకాశం ఉంది.


ఆలేరు నియోజకవర్గానికే చైర్మన్‌గిరి

పాల ఉత్పత్తులు అధికంగా ఉండడంతో పాటు అత్యధికంగా పాలక సంఘాల చైర్మన్లు ఉన్న ఆలేరు నియోజకవర్గానికే ఈ దఫా చైర్మన్‌ పదవి దక్కనున్నట్టు సమాచారం. తొలి నుంచి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తమ నియోజకవర్గానికి ఈసారి మదర్‌ డెయిరీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి జగదీ్‌షరెడ్డిని కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీ్‌షరెడ్డి సైతం ఆలేరు నియోజకవర్గానికే ఈసారి మదర్‌ డెయిరీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2022-09-28T05:21:15+05:30 IST