దారిపై పోరు

ABN , First Publish Date - 2020-12-06T05:29:59+05:30 IST

రహదారి సమస్యపై బీజేపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఆందోళలు చేపట్టారు.

దారిపై పోరు
కర్నూలు గుత్తి పెట్రోల్‌ బంక్‌ వద్ద నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

  1. రహదారులు ధ్వంసమైనా పట్టించుకోరా..?
  2. వెంటనే మరమ్మతు పనులు చేపట్టండి
  3. బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు.. ధర్నాలు


(న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి)

రహదారి సమస్యపై బీజేపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఆందోళలు చేపట్టారు. వర్షాలకు రహదారులు అధ్వానంగా మారాయని, నిత్యం వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్య గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే నిధులు మంజూరు చేసి, రహదారులను బాగు చేయాలని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులను కలిసి వినతి పత్రాలను సమర్పించారు.


కర్నూలు(ఎడ్యుకేషన్‌): కల్లూరు మండలంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయాలని ప్రభుత్వాన్ని బీజేపీ సీనియర్‌ నాయకులు నాగరాజు డిమాండ్‌ చేశారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రోడ్లు పాడైపోయాయని, రాకపోకలకు  తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. అధికారులు వెంటనే మరమ్మతుల పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కె.చెన్నయ్య, మదనమోహన ఆచారి, సుందర్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, సింగం సోమశేఖర్‌ రెడ్డి, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. 


ఆదోని టౌన్‌: పట్టణంలోని అన్ని రోడ్లు పాడైపోయి ప్రజలు ప్రమా దాల బారిన పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించు కోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి మళేకార్‌ శ్రీనివాస్‌ విమర్శిం చారు. పాడైన రోడ్లను వెంటనే బాగు చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందేసాయి ఆధ్వర్యంలో భీమాస్‌ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహిచారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రహదారుల నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ నాయకలు గోవిందరాజులు గౌడ్‌, దేశాయి చంద్రన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆధూరి విజయకృష్ణ, రమేష్‌ ఆచారి, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గౌడ్‌ పాల్గొన్నారు. 


నంద్యాల టౌన్‌: వర్షాలకు గుంతలు పడిన రోడ్లను వెంటనే పుడ్చాలని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. స్థానిక నూనెపల్లె హైవే సర్కిల్‌ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. రోడ్లు గుంతలమయం కావడంతో వాహన చోదకకులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి అభిరుచి మధు, కృష్ణమూర్తి, ముక్తార్‌ బాషా, ప్రసాదురాజు తదితరులు పాల్గొన్నారు.


డోన్‌: వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని బీజేపీ  నాయకులు హేమసుందర్‌ రెడ్డి, మహారాజ్‌, ఆర్మీ రామయ్య డిమాండ్‌ చేశారు. పంచాయతీ రాజ్‌ డీఈ రామక్రిష్ణా రెడ్డికి వినతి పత్రం అందజేశారు.  రహదారులు అధ్వానంగా తయారవ్వడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.  త్వరగా నిధులు కేటాయించి పనులు చేపట్టాలని కోరారు. 

ఆలూరు రూరల్‌:  గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ ఆలూరు నియోజకవర్గ కన్వీనర్‌ వెంకటరాముడు, జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు చిదానంద అన్నారు. అధ్వానంగా ఉన్న రహదారులను బాగుచేయాలని బీజేపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. రహదారులు అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారులను బాగు చేయాలని కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున, ప్రసాద్‌, ఆచారి, నరసప్ప, మళ్లయ్యస్వామి, శంకర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


బనగానపల్ల్లె: పాడైపోయిన రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలని బనగానపల్లె బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. పట్టణ శివారులోని బత్తులూరు పాడు వద్ద పార్టీ మండల అధ్యక్షుడు శరత్‌చంద్ర కుమార్‌, జిల్లా నాయకులు శివకృష్ణయాదవ్‌ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. అధిక వర్షాలకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం మరమ్మతు చేయకపోవడం సిగ్గు చేటని అన్నారు. సయ్యద్‌ జావీద్‌, శివరామిరెడ్డి, కంబయ్య యాదవ్‌; శంకర్‌యాదవ్‌, మధ్దయ్య, ఆంజనేయులు, హరికృష్ణ గౌడ్‌, రామమద్దిలేటి పాల్గొన్నారు. 


 ఆత్మకూరు: రోడ్ల ఆధునికీకరణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం తగదని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గౌడ్‌ అన్నారు. గుంతలమయంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని కోరుతూ ఆత్మకూరు - నంద్యాల ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధిని విస్మరించిందన్నారు. పన్నులు పెంచి డబ్బుపంచే పథకాలు తప్ప ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అంశాలను పట్టించు కోవడం లేదని ధ్వజమెత్తారు. ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లి, బండి ఆత్మకూరు మండలాల్లోని రహదారులపై గుంతలుపడి వాహన చోదరులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారన్నారు. వెంటనే బాగుచేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కర్యాక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు ప్రతాప్‌ ఆచారి, జయచంద్రగౌడ్‌, రాఘవేంద్ర, లబ్బి రమణ, మునిస్వామి, సురేష్‌, శివ, షాలుబాష, రవి తేజ, అశోక్‌ కుమార్‌, విష్ణు, షాహిద్‌ బాషా, అబ్దుల్‌ కలాం, శేషు తదితరులు పాల్గొన్నారు. 


 కోడుమూరు 5: నియోజకవర్గంలోని క్రిష్ణాపురం, చనుగొండ్ల గ్రామాలతో పాటు కోడుమూరు నుంచి సి. బెళగల్‌కు రోడ్లు వేయించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. బీజేపీ కార్యాలయం నుంచి మండల పరిషత్‌ కార్యాలయం వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్‌ మీసాల ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం అయిందని అన్నారు.   ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సల్వాది సురేంద్ర, నాయకులు నరసింహవర్మ, పరశురామ్‌, మిస్కిన్‌ శ్రీను పాల్గొన్నారు.


మద్దికెర: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ రహదారుల కోసం మంజూరు చేసిన గ్రామీణ సడక్‌ అవాజ్‌ యోజన పథకం నిధులను సంక్షేమ పథకాలకు బదిలీ చేయడం అన్యాయమని బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా మాజీ కార్యదర్శి చంద్రశేఖర్‌యాదవ్‌  అన్నారు. శనివారం మద్దికెర   బస్టాండ్‌ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాచేసి ఎంపీడీవో నరసింహమూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బురుజుల నుంచి మద్దికెర వరకు డబల్‌ తారురోడ్డు మంజూరు అయినా  ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మండల అధ్యక్షుడు భాస్కర్‌, బీజేపీ నాయకులు నాగే్‌షయాదవ్‌, పూనా మల్లికార్జున, దండి మల్లికార్జున, నాగేష్‌, బ్రహ్మయ్య, కరణం నాగేష్‌   పాల్గొన్నారు. 


సి.బెళగల్‌:  నియోజకవర్గంలో గ్రామీణ రోడ్లు అఽధ్వానంగా ఉన్నాయని, వాటికి మరమ్మతు చేయించాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మీసాల ప్రేమ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని అన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం మండల డిప్యూటీ తహసీల్దార్‌ ఉమారాణికి వినతి పత్రం ఇచ్చారు.   వెంకప్ప, అంజి, రాజు ఉన్నారు. 


Updated Date - 2020-12-06T05:29:59+05:30 IST