Sep 16 2021 @ 08:46AM

వార్ డ్రామా ‘పిప్పా’ పోస్టర్ రిలీజ్

షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా ‘పిప్పా’ అనే టైటిల్‌తో ఓ వార్ డ్రామా మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 45వ అశ్వికదళ ట్యాంక్ స్క్వాడ్రన్‌కి చెందిన బ్రిగేడియర్ మెహతా కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజ కృష్ణ మీనన్ దర్శకత్వంలో నిర్మాతలు రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ కలసి నిర్మిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్, కత్రినా కైఫ్, హుమా ఖురేషి, నేహా ధూపియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండో-పాకిస్తాన్ మధ్య వార్ డ్రామాగా తెరకెక్కనున్న ‘పిప్పా’ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమవగా, ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను వదిలారు. 

Bollywoodమరిన్ని...