రాజకీయాలను వదిలేయాలనిపిస్తుంటుంది: గడ్కరీ

ABN , First Publish Date - 2022-07-26T09:56:08+05:30 IST

జీవితమంటే రాజకీయాలు మాత్రమే కాదని, వాటి నుంచి తప్పుకోవాలని చాలాసార్లు తనకు అనిపిస్తుంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.

రాజకీయాలను వదిలేయాలనిపిస్తుంటుంది: గడ్కరీ

న్యూఢిల్లీ, జూలై 25: జీవితమంటే రాజకీయాలు మాత్రమే కాదని, వాటి నుంచి తప్పుకోవాలని చాలాసార్లు తనకు అనిపిస్తుంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాజీ ఎంఎల్‌సీ, ఎన్‌సీపీ మాజీ నేత గిరీశ్‌ గాంధీకి జరిగిన సన్మాన కార్యక్రమంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాలకు సామాజిక మార్పు లక్ష్యం కావాలి. నేడు అధికారం సాధించడమే పరమావధిగా మారింది. రాజకీయాలు సమాజ శ్రేయస్సు, దేశ ప్రగతి కోసమా లేక అధికారంలో ఉండటం కోసమా అన్నది మనం ఆలోచించుకోవాలి’’ అని గడ్కరీ స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-26T09:56:08+05:30 IST