తినేందుకు ఉద్యోగులు కావలెను.. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 15...

ABN , First Publish Date - 2021-01-26T22:02:45+05:30 IST

క్యాండీ... కెనడాకు చెందిన ఓ రుచికరమైన ఆహారం. అయితే.. ఒక్కొక్కరు ఒక్కో క్యాండీని ఇష్టపడుతుంటారు. క్యాండీలు తినేందుకు ఆయా దేశాల్లో పోటీలు కూడా పెడుతుంటారు.

తినేందుకు ఉద్యోగులు కావలెను.. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 15...

అట్టావా(కెనడా) : క్యాండీ... కెనడాకు చెందిన ఓ రుచికరమైన ఆహారం. అయితే.. ఒక్కొక్కరు ఒక్కో క్యాండీని ఇష్టపడుతుంటారు. క్యాండీలు తినేందుకు ఆయా దేశాల్లో పోటీలు కూడా పెడుతుంటారు. క్యాండీలకు అంతగా ప్రాచుర్యం ఉంది మరి. అందుకేననుకుంటా... క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావాలంటూ కెనడాకు చెందిన ఓ క్యాండీ తయారీ కంపెనీ ప్రకటన జారీచేసింది. వివరాలిలా ఉన్నాయి.


అంటారియోలోని మిస్సిసాగాలో ఉన్న క్యాండీ తయారీ కంపెనీ క్యాండీ ఫన్‌హౌస్ తమ క్యాండీలను రుచి చూసి ఏవిధంగా ఉన్నాయో సమీక్షించేందుకుగాను ఉద్యోగులు కావాలంటూ... సంస్థ వెబ్‌సైట్‌ క్యాండీఫన్‌హౌస్ లో ప్రకటనను పోస్ట్‌ చేసింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.


తమ క్యాండీలను రుచి చూసి, ఎలా ఉన్నాయో చెప్పడమన్నది ఈ ఉద్యోగుల పని. ఈ సంస్థ ప్రస్తుతం 3 వేల రకాల ఉత్పత్తులను తయారుచేస్తోంది. అంతేకాదు... మరో పది రకాల క్యాండీలను కూడా త్వరలోనే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు న్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అసలైన క్యాండీలను ఎన్నుకోవడంలో సహాయపడాల్సిన క్రమంలో... బలమైన దంతాలు కలిగివున్న పార్ట్‌టైమ్ / ఫుల్‌టైమ్‌ అభ్యర్థులు అవసరమని పేర్కొంది.


క్యాండియోలోజిస్ట్‌లు ‘రుచి, ఆకృతి, నాణ్యత తదితర  అంశాలను పరిగణనలోకి తీసుకుని క్యాండీల గొప్పదనాన్ని తెలుపాల్సి ఉంటుంది’అని క్యాండీ ఫన్‌హౌస్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. 


ఇక... ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు అమెరికా, కెనాడా వాసులై ఉండి 18 సంవత్సరాలకు పైబడిన వయసు వారై ఉండాలి. అయితే... ఎటువంటి ఆహార ఎలర్జీలు లేకుండా ఉండాలి. . ఇక... ఈ ఉద్యోగంలో చేరే వారికి గంటకు 30 డాలర్ల పారితోషికాన్ని ఇవ్వనున్నారు. కాగా... కేవలం పది మందిని మాత్రమే ఎంపిక చేసుకుంటామని కంపెనీ ప్రకటించింది. ఇక...దరఖాస్తుల అందజేతకుగాను ఫిబ్రవరి 15 చివరి తేదీ. 

Updated Date - 2021-01-26T22:02:45+05:30 IST