వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-08-11T05:59:20+05:30 IST

స్వాతంత్య్ర 75వ వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి కోరారు.

వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలి
రాజాపేటలో జాతీయ పతాకాలతో ప్రభుత్వ విప్‌ సునీత, ఇతర అధికారులు

ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌: స్వాతంత్య్ర 75వ వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి కోరారు. బుధవారం రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలను నాటారు. గ్రామంలో జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని, దేశాన్ని ప్రపంచంలో ఉన్నతంగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపగాని బాలమణి యాదగిరిగౌడ్‌, రాజిరెడ్డి, సంతోష్‌, సందెల భాస్కర్‌, తిరుపతిరెడ్డి, రమేష్‌, అధికారులు దీపిక, రామరాజు పాల్గొన్నారు. భూదానపోచంపల్లి పట్టణంలో కలెక్టర్‌ పమేలా సత్పథి నారాయణగిరి వద్ద బాలాజీ వెంచర్‌లో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ పార్కును ప్రారంభించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌తివారీ, మున్సిపల్‌ కమీషనర్‌ ఎస్‌ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. పోచంపల్లి మండల పరిధిలోని జలాల్‌పూర్‌ గ్రామంలో ఫ్రీడమ్‌ పార్కును జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి ప్రారంభించారు.  జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, స్థానిక సర్పంచు పర్నె రజిత మల్లారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన కందాడి భూపాల్‌రెడ్డి, ఎంపీడీవో ఎ బాలశంకర్‌ పాల్గొన్నారు. బీబీనగర్‌ శివారులోని గురుకుల మహిళా ఆర్మి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు త్రివర్ణం పోలిన దుస్తులు ధరించి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో ఆర్మీ కళాశాల ప్రిన్సిపాల్‌ స్పందన పాల్గొన్నారు. కొండమడుగు గ్రామంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ గోళి ప్రణితా పింగల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ గణే్‌షరెడ్డి, సర్పంచ కడెం లతా రాజే్‌షబాబు, ఆధ్వర్యంలో  జాతీయ జెండాలతో గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. అడ్డగూడూరు మండలంలోని చిన్నపడిశాల, చౌళ్లరామారం గ్రామాల్లో ఆప్కారీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, సర్పంచులు సోంమిరెడ్డి, జోజి, సీఐ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. రామన్నపేటలో సర్పంచ గోదాసు శిరీష పృఽథ్విరాజ్‌ పాల్గొన్నారు.   సిరిపురం ఫ్రీడమ్‌ పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబొయిన జ్యోతి బలరాం, ఎంపీడీవో జి.జలంధర్‌రెడ్డి, సర్పంచ అప్పం లక్ష్మీనర్సు, ఎంపీటీసీ బడుగు రమేష్‌ పాల్గొన్నారు. బీబీనగర్‌ పోలీసులు స్థానిక రాఘ వేంద్ర థియేటర్‌లో విద్యార్థులకు గాంధీ సినిమాను చూపించారు. ఎంఈవో నాగవర్ధనరెడ్డి, ఎస్‌ఐ సైదులు పాల్గొన్నారు.  యాదగిరిగుట్ట  మండలంలోని మల్లాపురం గ్రామంలో  మొక్కలతో 75వ వజ్రోత్సవ సంఖ్యను రూపొందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధబీరయ్య, ఎంపీపీ చీర శ్రీశైలం పాల్గొన్నారు. గుట్ట ప్రభుత్వ కళాశాలలో  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, ప్రిన్సిపాల్‌ రామనూజచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు.  మోత్కూరు పట్టణ పరిధిలోని ధర్మాపురంలో మునిసిపల్‌ చైర్‌పర్సన తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ సి.శ్రీకాంత ఫ్రీడం పార్కును ప్రారంభించారు. గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, జిల్లా కోఆప్షన సభ్యుడు ఎండీ.ఖలీల్‌, సర్పంచు మలిపెద్ది మాధవి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలో ఎంపీపీ తండ మంగమ్మ, ఎంపీడీవో ఏ.రాములు, ఎస్‌ఐ జి,మధు. సర్పంచ జె.నగేష్‌, ఎంపీటీసీ వై.కవిత పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T05:59:20+05:30 IST