వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-08-11T06:05:11+05:30 IST

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలంతా భాగ స్వాములై విజయవతం చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ పిలుపునిచ్చారు. బుధవారం మావల మండల కేంద్రంలో పర్యటించారు. ఈ మేరకు మావల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ పార్కును లాంఛనం గా ప్రారంభించారు.

వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలి
మావలలో ఫ్రీడమ్‌ పార్కును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

మావలలో ఫ్రీడమ్‌ పార్కును ప్రారంభించిన కలెక్టర్‌

మావల, ఆగస్టు 10: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలంతా భాగ స్వాములై విజయవతం చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ పిలుపునిచ్చారు. బుధవారం మావల మండల కేంద్రంలో పర్యటించారు. ఈ మేరకు మావల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ పార్కును లాంఛనం గా ప్రారంభించారు. మొక్కలు నాటిన అనంతరం సిబ్బందికి అవసరమైన సూచ నలు చేశారు. అదేవిధంగా ఇంటింటికీ జెండాలను పంపణీ చేసి త్రివర్ణ పథకాల ను ఎగురవేసే సమయంలో పాటించవల్సిన నియమ నబంధనలను గ్రామస్థుల కు వివరించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌, ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, డీఆర్డీవో పీడీ కిషన్‌, డీపీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వనజ, ఎంపీడీవో బండి అరుణ్‌, ఎంపీవో లక్ష్మణ్‌, సర్పంచ్‌ ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా జైలులో మొక్కలు నాటిన కలెక్టర్‌

ఆదిలాబాద్‌ టౌన్‌: వజ్రోత్సవ కార్యక్రమాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. బుధవారం జిల్లా జైలులో సుమారు 200 వివిధ రకాల మొక్కలనుకలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, జైలు సిబ్బంది నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వజ్రోత్సవ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటు తున్నామని తెలిపారు. ఈ వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా  నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఫ్రీడమ్‌రన్‌, రక్తదాన శిబి రాలు వంటి కార్యక్రమాలలో భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్రమాలలో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషషేక్‌, ఆర్డీఓ రమేష్‌రాథోడ్‌, జిల్లా జైలు అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, జడ్పీటీసీ టి.రాజు, తహసీల్దార్‌లు వనజా రెడ్డి, శ్రీదేవి, సర్పంచ్‌లు, విద్యార్థులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఫ్రీడమ్‌ పార్కులను ప్రారంభించిన ఎస్పీ

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు పురస్కరంచుకుని ఈ నెల10 వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌ కుమార్‌రెడ్డి చేతుల మీదు గా ఫ్రీడం పార్కులను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ రావు, డీఎస్పీలు ఉమేందర్‌, విజయ్‌కుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ జె.కృష్ణ మూర్తి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటి, ఎం.శ్రీపాల్‌, ఎం.వంశీకృష్ణ, స్పెషల్‌ బ్రాంచ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌ఉల్‌హాక్‌, సాయుధ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T06:05:11+05:30 IST