అదే లక్ష్యం కావాలి!

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

మనకు ఉన్నదేమిటో ఆలోచించుకోవాలి. దానితో సంతృప్తి చెందాలి...

అదే లక్ష్యం కావాలి!

మనిషిని నాశనం చేసే గుణాల్లో ఈర్ష్య ఒకటి.  వేరొకరికి సంపద ఉందనో, వారు సంతోషంగా ఉన్నారనో, మనకు లేని సంపదో, లక్షణమో వారికి ఉందనో ఈర్ష్య పడడం వల్ల ప్రయోజనం లేదు. మనకు ఉన్నదేమిటో ఆలోచించుకోవాలి. దానితో సంతృప్తి చెందాలి. సామర్థ్యం ఉంటే మనం కూడా వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. సంతృప్తి లేని వాడి జీవితం అంధకారం అవుతుంది. ఈర్ష్య అతణ్ణి నిప్పులా దహించి నాశనం చేస్తుంది. ‘‘మీ శరీరానికి కన్నే దీపం. మీ కన్ను ఒకే దాని మీద దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడు మీ శరీరం ప్రకాశిస్తూ ఉంటుంది. మీ కన్ను ఈర్ష్యతో నిండి మూసుకుపోతే మీ శరీరం మొత్తం అంధకారంతో నిండిపోతుంది. మీలో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతే, ఆ చీకటి ఎంత భయానకంగా ఉంటుందో తెలుసుకోండి’’ (మత్తయి సువార్త 6:22-23) అని ఏసు ప్రభువు ఆనాడే హెచ్చరించాడు. విశ్వాసికి అనేక ఇతర విషయాల మీద దృష్టి ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఈర్ష్య అతని హృదయాన్ని ఆవరిస్తుంది. ‘దైవ కృపను పొందడం’ అనే ఒకే లక్ష్యం మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు ఈర్ష్యకు తావు ఉండదు. అప్పుడు హృదయం వెలుగులతో నిండుతుంది. ప్రశాంతతతో ప్రకాశిస్తుంది.

Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST