Abn logo
Sep 20 2021 @ 16:35PM

Babul Supriyo: 2024లో మమత ప్రధాని కావాలి

కోల్‌కతా: టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీదారుల్లో మమత ముందున్నారని అన్నారు. భారతదేశ తదుపరి ప్రధాని మమత కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘‘మా పార్టీ కెప్టెన్ మమతా బెనర్జీ 2024లో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక పాత్ర. ప్రధాని పదవికి పోటీదారుల్లో మమత ముందువరుసలో ఉన్నారనేది ఎవరూ కాదనలేని సత్యం’’ అని బాబుల్ సుప్రియో నేడు ‘ఏఎన్ఐ’తో పేర్కొన్నారు.


రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో నిన్న టీఎంసీలో చేరారు. రాజకీయాలను విడిచిపెడుతున్నట్టు అప్పట్లో ప్రకటించిన బాబుల్ సుప్రియో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు. కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సుప్రియోను మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారి తానేమీ చరిత్ర సృష్టించలేదన్న బాబుల్ సుప్రియో త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 

ఇవి కూడా చదవండిImage Caption