‘‘ప్రతి యాక్టర్‌కి తప్పకుండా హిట్ సినిమా వస్తుంది. సందీప్‌కి మంచి హిట్స్ ఉన్నప్పటికీ ఈ చిత్రం తన కెరీర్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ కావాలి’’ అని హీరో రామ్ అన్నారు. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వం వహించిన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సందీప్ మాట్లాడుతూ ‘‘ఎవరికీ అవకాశాలు అంత సులభంగా రావు. మనమే సృష్టించుకోవాలి. ఆ టైంలో మనకు అండగా నిలబడ్డవారే దేవుళ్ళు. నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ ఈ సినిమా అంగీకరించడంతో నా జీవితం మారిపోయింది. హిప్ అప్ తమిళ ఇచ్చిన ఐడియాతో ఈ సినిమా ప్రారంభించాం. తను చక్కని పాటలిచ్చాడు’’ అని అన్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ఇది’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. ఇందులో రఫ్‌గా ఉండే రౌడీలాంటి క్యారెక్టర్ చేశానని లావణ్యా త్రిపాఠీ అన్నారు.