పేటూరులో ఏనుగుల సంచారం

ABN , First Publish Date - 2021-10-28T05:49:50+05:30 IST

సోమల మండలం పేటూరు, అన్నెమ్మగారిపల్లె పంచాయతీల్లోని పొలాల్లో జంట ఏనుగులు సంచరించి పంటలను ధ్వంసం చేయడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

పేటూరులో ఏనుగుల సంచారం
పొలికిమాకులపల్లెలో ఏనుగుల దాడిలో దెబ్బతిన్న వరి పంట

సోమల అక్టోబరు 27:  సోమల మండలం పేటూరు, అన్నెమ్మగారిపల్లె పంచాయతీల్లోని పొలాల్లో జంట ఏనుగులు సంచరించి పంటలను ధ్వంసం చేయడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి పొలికిమాకులపల్లెకు చెందిన శంకర్‌రెడ్డి, వెంకటప్ప, లింగప్ప, మణి, గంగాధరంకు చెందిన వరి పంటలో ఏనుగులు సంచరించి డ్రిప్‌ పరికరాలు, పైపులైన్లను ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు. జంట ఏనుగులు మూడు రోజులుగా ఇర్లపల్లె, పేటూరులలో తిష్ట వేసి  వరి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేయడంతో రైతులు పొలాల వద్దకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు జంట ఏనుగులను అటవీ ప్రాంతం వైపు మళ్లించాలని రైతులు కోరుతున్నారు. ఆర్‌ఐ ప్రకాశ్‌బాబు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.

Updated Date - 2021-10-28T05:49:50+05:30 IST