‘వనా’శనం..!

ABN , First Publish Date - 2021-10-27T05:01:37+05:30 IST

జిల్లాలో అటవీ సంపద రోజురోజుకూ తగ్గుముఖం ప డుతుంది. అడవులు తరిగిపోతున్న కారణంగా ఇటు పర్యావరణం దెబ్బతినడమే కాకుండా వన్యప్రాణుల జీవనానికి సైతం ముప్పు వాటిల్లుతోంది. తరిగిపోయిన అడవులను మళ్లీ పెంచేందుకే కాకుండా ప్రస్తు తం ఉన్న అడవులను స్మగ్లర్ల బారి నుంచి రక్షించేందుకు సంబంధిత శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించినా మేరకు ఫలితాన్నివ్వడం లేదని పలువురు అంటున్నారు.

‘వనా’శనం..!
కలపను స్మగ్లింగ్‌ చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

జిల్లాలో తరిగిపోతున్న అటవీ సంపద
రోజురోజుకూ పెరిగిపోతున్న స్మగ్లర్ల ఆగడాలు
స్మగ్లర్ల దాడులతో తనిఖీలపై వెనుకడగు
ఆయుధాలు కావాలంటున్న అధికారులు
ఇప్పటి వరకు జరిగిన దాడులపై నామమాత్రపు చర్యలు


నిర్మల్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటవీ సంపద రోజురోజుకూ తగ్గుముఖం ప డుతుంది. అడవులు తరిగిపోతున్న కారణంగా ఇటు పర్యావరణం దెబ్బతినడమే కాకుండా వన్యప్రాణుల జీవనానికి సైతం ముప్పు వాటిల్లుతోంది. తరిగిపోయిన అడవులను మళ్లీ పెంచేందుకే కాకుండా ప్రస్తు తం ఉన్న అడవులను స్మగ్లర్ల బారి నుంచి రక్షించేందుకు సంబంధిత శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించినా మేరకు ఫలితాన్నివ్వడం లేదని పలువురు అంటున్నారు.
పలు మండలాల్లో అడవుల నరికివేత..
ముఖ్యంగా కడెం, ఖానాపూర్‌, పెంబి, దస్తూరాబాద్‌, మామడ, సా రంగాపూర్‌, కుభీర్‌ తదితర మండలాల్లో అడవుల నరికివేత, కలప తరలింపుతో పాటు వన్యప్రాణుల వేట యాథేచ్ఛగా సాగుతోందన్న వాదనలున్నాయి. ప్రధానంగా కొన్ని మండలాల్లో స్మగ్లర్లు అక్కడి అడవుల్లో స మాంతర వ్యవస్థను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొంతమం  ది స్థానికుల సహకారంతో స్మగ్లర్లు విలువైన చెట్లను నరికివేస్తూ ఆ కలపను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ తతంగం జిల్లా అంతటా కొనసాగుతోంది. అయితే, అటవీ అధికారులు పెద్దఎత్తున దాడు లు జరుపుతున్నప్పటికీ ఫలితాన్నివ్వడం లేదన్న అభిప్రాయాలున్నాయి. కలప స్మగ్లర్లు తమకు అడ్డువచ్చే అటవీ అ ధికారులపై ఎదురుదాడులు చేస్తున్నారు. వీరి దాడుల్లో ఇ ప్పటికే చాలా మంది అధికారులు తీవ్రంగా గాయపడడమే కా కుండా ఒకరిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారంటే ఇక్కడ స్మగ్లర్ల ప్రాబల్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆత్మరక్షణ కోసం ఆయుధాలు..
దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు అటవీ అధికారు లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు. ఈ నే పథ్యంలో కొంతకాలం నుంచి అటవీ శాఖ అధికారులు స్మగ్లర్ల దాడు ల నుంచి కాపాడుకునేందుకే కాకుండా ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇ వ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. పలుసార్లు అటవీ శాఖ ఉన్నతాధికారులకు, సంబంధిత శాఖ మంత్రికే కాకుండా ముఖ్యమంత్రికి ఆయుధా ల విషయంలో విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. మళ్లీ ఇటీవల అధికారులు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు ఆ శాఖ ఉ న్నతాధికారులను సైతం కోరారు. తమకు స్మగ్లర్ల నుంచి ప్రాణభయం ఉందని స్మగ్లర్ల వద్ద ఉన్న మారణాయుధాలతో తమపై దాడులు చే స్తున్న కారణంగా చట్టానికి లోబడి తాము వారిపై ఎలాంటి ప్రతీ దా డులు చేయలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు. పోలీసు శాఖకు మాత్రమే ఆయుధాలను సమకూరుస్తుండ గా తాజాగా అటవీ శాఖ కూడా ఆయుధాలు కావాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
ఆయుధాలపై స్పందన కరువు
అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు సర్కారు సైతం ఆయుధాల విషయంలో అచితూచి వ్యవహరిస్తోంది. తమకు ఆయుధాలు కావాలంటూ ఇప్పటికే పలుసార్లు అధికారులు డిమాండ్‌ చేసినప్పటికీ సం బంధిత శాఖ వారి డిమాండ్‌పై పెద్దగా స్పందన కనబర్చడం లేదు. ఆయుధాలు సమకూరిస్తే అనుకూల త కన్నా ప్రతికూలత ఎక్కువగా జరిగే అవకాశాలుంటాయన్న భావనతో సంబంధిత శాఖ ఉన్నతాధికారు లు ఉన్నారంటున్నారు. అటవీ అధికారులు తమ విధుల్లో భాగంగా కొన్నిసార్లు అతిగా ప్రవర్తిస్తేనే ఆరోపణలు వస్తున్నాయని, పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులను బలి పశువులు చేస్తున్నారని చెబుతున్నారు. అటవీ భూములను ఆక్రమించుకొని ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న వారు సైతం తమకు అడ్డు వచ్చే అధికారులపై దాడులు జరుపుతున్న సంఘటనలుయి. ఒకవేళ అటవీ అధికారులకు ఆయుధాలు సమకూరిస్తే ఇలాంటి సమయంలో ఏదైనా సంఘటన జరగవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అటవీ శాఖలో ఆయుధాలు సమకూర్చే వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది.
అచితూచి వ్యవహరిస్తున్న సర్కారు
ప్రభుత్వం మాత్రం అటవీ శాఖ అధి కారులకు ఆయుధాలను సమకూర్చే వ్య వహారంలో అచితూచిగా వ్యవహరిస్తోంది. పోలీసులకు మాత్రమే ఆయుధాల సౌకర్యం ఉండగా అటవీ శాఖ అధికారు లకు ఆయుధాలు అందిస్తే చట్టపరంగా శాంతి భద్రతల విషయంలో ఇబ్బందు లు తలెత్తవచ్చన్న వాదనలున్నాయి. కొం తమంది ఆయుధాలను దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వి ధానపరంగా ఆయుధాలు సమకూరిస్తే ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశాలుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అటవీ అ ధికారులకు ఆయుధాలు సమకూర్చే విషయంలో అధ్యయనం కోసం కమిటీలను కూడా నియమించింది. ఈ కమిటీల నివేదికలు ప్రతికూలంగా ఉన్న కారణంగా ఆయుధాలను సమకూర్చే విషయమై ప్రభు త్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేకపోయింది.
వరుస దాడులతో ఆందోళన..
జిల్లాలో కలప స్మగ్లర్లు తమకు అడ్డు వచ్చే అటవీ అధికారులపై దా డులు జరుపుతుండడం సహజంగా మారింది. పెంబి, కడెం, ఖానాపూర్‌ మండలాల్లో దాడులు ఎక్కువగా జరగడం గమనార్హం. అడవుల్లో నరికివేసిన కలపను పథకం ప్రకారం సరుకుల వాహనాల్లో, ప్రయాణికుల వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అటవీ చెక్‌ పోస్టులను సైతం దాటించి తమ కలపను పొరుగు జిల్లాల కు తరలిస్తుండడం రివాజుగా మారిపోయింది. ఇలాంటి దాడులతో సి బ్బంది చెట్ల నరికవేతను నివారించేందుకు భయపడుతున్నారు.

Updated Date - 2021-10-27T05:01:37+05:30 IST