రైతు వేదిక భవన నిర్మాణాలు పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-09-27T05:56:31+05:30 IST

పంటల సాగులో రైతు లకు మెలకువలు తేలియజేయడానికి ఉపయో గపడే రైతు వేదిక భవన నిర్మాణాలను ఆక్టోంబరు 10వ తేదికి పూర్తిచేయాలని కలెక్టర్‌ యాస్మిన్‌....

రైతు వేదిక భవన నిర్మాణాలు పూర్తి చేయండి

కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా


కొత్తకోట, సెప్టెంబరు: పంటల సాగులో రైతు లకు మెలకువలు తేలియజేయడానికి ఉపయో గపడే రైతు వేదిక భవన నిర్మాణాలను ఆక్టోంబరు 10వ తేదికి పూర్తిచేయాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అధికారులను ఆదేశించారు. మండలంలోని క నిమెట్ట, పాలెం గ్రామాల్లో నిర్మాణం అవుతున్న రై తువేదిక భవనాలను  శనివారం  సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడు తూ అన్ని హంగులతో నిర్మించబడిన భవనాల నుంచే రైతులకు వ్యవసాయంలో కావాల్సిన సల హాలు, సూచనలు చేయబడుతుందన్నారు.  సీజ న్‌లో ఏపంటలు ఏనేలల్లో ఎప్పుడు విత్తాలనో చెప్ప బడుతుందన్నారు. అలాంటి భవనాలను రైతులకు స్వాధీనం చేయాలని కోరారు. అధికారులు, కాంట్రా క్టర్‌ నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఎంపీపీ గుంతమౌనిక, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వా మన్‌గౌడ్‌, సర్పంచులు గాదంరాణి, రాధ, రామకృ ష్ణారెడ్డి, అలీం, పరమేష్‌, కోటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 


రైతువేదిక నిర్మాణాల పరిశీలన

పెద్దమందడి: జిల్లా పరిధిలో నిర్మిస్తున్న 71 రైతు వేదికలను అక్టోబరు 5 నాటికి నిర్మాణాలు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కలె క్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సూచించారు. మండలం లోని వెల్టూర్‌, మోజర్ల గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణాలను శనివారం ఆమె  పరిశీలిం చారు. రైతు వేదికలను ప్రభుత్వం సూచించిన నా ణ్యత ప్రమాణాల మేరకు నిర్మించాలని నాణ్యతలో లోపం ఉంటే వాటికి బిల్లులు మంజూరి జరగదని కలెక్టర్‌ హెచ్చరించారు. జిల్లా మొత్తంలో 71 రైతు వేదికల నిర్మాణం జరుగుతోందని అందులో 3 రైతు వేదికలు దాతలు సహాయంతో నిర్మాణం జరుగుతున్నాయన్నారు. మిగతా 68 రైతు వేదిక లలో ఆరు రైతు వేదికలు పూర్తయ్యాయని, మిగత వేదికలు వివిధ ధశల నిర్మాణాల్లో ఉన్నాయన్నారు. వెల్టూర్‌ రైతు వేదిక నిర్మాణంపై అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణాలు వేగవంతంగా చేయాలని నాణ్యతలో లోపం ఉండకూడదని ఏజెన్సీ సభ్యుల ను ఆదేశించారు.  పల్లె ప్రకృతి వనాలను అక్టోబరు 30 నాటికి అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలన్నారు.  వెల్టూర్‌ సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, సునీత, పీఆర్‌ ఈఈ శివకుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి సుధా కర్‌రెడ్డి, డీఈ ప్రసాద్‌, తహసీల్దార్‌ సునీత, ఎంపీ డీవో రఘురాం, ఏఈ భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-27T05:56:31+05:30 IST