పచ్చని చెట్లే ప్రగతికి సోపానం: దేవినేని అవినాష్
పటమట, జూలై 6 : పచ్చని చెట్లే ప్రగతికి సోపానం అని వైసీపీ తూర్పు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం పటమట ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 750 మొక్కలు పంపిణీ చేశారు. పచ్చని చెట్లను నాటి ప్రకృతి సమతుల్యతను కాపాడుదాం అన్నారు. కార్పొరేటర్లు చింతల సాంబయ్య, కలపాల అంబేద్కర్, డివిజన్ అధ్యక్షుడు శెటికం దుర్గా ప్రసాద్, స్కూల్ ప్రిన్సిపాల్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.