Jul 6 2021 @ 12:30PM

డిజిటల్‌ శివగామిగా వామికా గబ్బి

బాహుబలి.. తెలుగు సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చాటిన చెప్పిన చిత్రం. అంతే కాదు, కలెక్షన్స్‌తో ఇండియన్‌ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన చిత్రం కూడా. ఈ సినిమాలో ప్రతి పాత్రను దర్శకధీరుడు రాజమౌళి పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాడు. అలాంటి శక్తివంతమైన పాత్రల్లో ఓ పాత్ర రాజమాత శివగామి పాత్ర. సినిమాలో ఈ పాత్రను రమ్యకృష్ణ అద్భుతంగా పోషించారు. ఇప్పుడు అదే పాత్రను చేసే అవకాశం మరో హీరోయిన్‌కు దక్కింది. ఆ హీరోయిన్‌ ఎవరో కాదు.. వామికా గబ్బి. బాహుబలిని ఆధారంగా చేసుకుని ప్రముఖ డిజిటల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ 'బాహుబలి బిఫోర్‌ బిగినింగ్‌' పేరుతో సినిమాను నిర్మించాలనుకుంది. ఆనంద్‌ నీలకంఠ పుస్తకం ఆధారంగా డెబ్సై శాతం సినిమాను కూడా పూర్తి చేశారు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ శివగామిగా నటించింది. అయితే మేకర్స్‌కు అవుట్‌పుట్‌ నచ్చకపోవడంతో ..ఎంటైర్‌ యూనిట్‌ను రీప్లేస్‌ చేసి మళ్లీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ స్థానంలో దర్శక నిర్మాతలు వామికా గబ్బిని ఎంపిక చేసుకున్నారట. మరి ఈ ఒరిజినల్‌ వామికకు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి.