Abn logo
Jul 15 2020 @ 00:03AM

ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ రూ.9,000 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: భారతీయ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని గ్రూప్‌ 120 కోట్ల డాలర్ల (రూ.9,045 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. అమెజాన్‌, ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో మార్ట్‌కు గట్టి పోటీనిచ్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని వాల్‌మార్ట్‌ భావిస్తోంది. వాల్‌మార్ట్‌ సహా గ్రూప్‌లో ఉన్న ప్రస్తుత వాటాదారులు ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. రెండేళ్ల క్రితం ఫిప్‌కార్ట్‌లో 77 శాతం  వాటాను 1,600 కోట్ల డాలర్లకు వాల్‌మార్ట్‌ చేజిక్కించుకుంది.

Advertisement
Advertisement
Advertisement