Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంక్రాంతి సందడి

ఇళ్ల ముంగిట వేసిన రంగవల్లులు 

ముగ్గుల్లో గొబ్బెమ్మల అలంకరణలు

చిన్నారుల గాలిపటాలు 

అంబరాన్నంటుతున్న సంబురాలు

జిల్లాలో నేడు సంక్రాంతి వేడుకలు

నిజామాబాద్‌ కల్చరల్‌, జనవరి 14: జిల్లాలో ఊరూరా సంక్రాంతి సందడే కనిపిస్తోంది. ఇంటి వాకిళ్లు రంగు రంగుల ముగ్గులు, గుమగుమలాడే పిండి వంటకాలు సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెలకు చేరుకున్న ప్రజలు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. శుక్రవారం భోగిపండుగతో ప్రారంభమైన సంక్రాంతి ఆదివారం కనుమతో ముగియనుంది. పండుగ నేపథ్యంలో మార్కెట్‌లన్నీ సందడిగా మారాయి. కొనుగోలు, అమ్మకందారులతో కిటకిటలాడాయి. అయితే జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో పండుగ వేల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement