మార్కెట్లో సంక్రాంతి శోభ

ABN , First Publish Date - 2022-01-15T04:04:21+05:30 IST

సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లాలో ఆయా ప్రాంతాల్లో శుక్రవారం మార్కెట్‌ల్లో పండుగ సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ సంబందించిన నోముల సామగ్రి, పతంగులు, దారం, చరఖాలు, వివిధ రకాల పూలు, రేగుపండ్లను ముగ్గులకు కావాల్సిన రంగుల కొనుగోళ్లతో మార్కెట్లో బిజీబీజీగా మారింది.

మార్కెట్లో సంక్రాంతి శోభ
మంచిర్యాల మార్కెట్‌లో రేగుపండ్లు కొనుగోలు చేస్తున్న మహిళలు

- నోము సామగ్రి కొనుగోళ్లతో మహిళల సందడి
నస్పూర్‌/మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 14: సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లాలో ఆయా ప్రాంతాల్లో శుక్రవారం మార్కెట్‌ల్లో పండుగ సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ సంబందించిన నోముల సామగ్రి, పతంగులు, దారం, చరఖాలు, వివిధ రకాల పూలు,  రేగుపండ్లను ముగ్గులకు కావాల్సిన రంగుల కొనుగోళ్లతో మార్కెట్లో బిజీబీజీగా మారింది. పూజలకు వినియోగించే చక్కర చిలుకలు, దారాలు, స్వీట్లు, ఇతర పూజా సామగ్రి కొనుగోళ్ల అమ్మకాలు జోరుగా సాగాయి. సంక్రాంతి సందర్భంగా వివిధ రకాల రంగుల అమ్మకాలు జోరుగా జరుగుతాయి.   ఇళ్ల వాకిళ్ళకు సరికొత్త అందాన్ని తెచ్చి పెట్టడానికి మహిళలు ముగ్గులను తీర్చిదిద్దుతారు. రకరకాల రంగులను కొనుగోలు చేసి ఇంటి ముందు ముగ్గులు వేయడానికి మహిళలు పోటీతో ముస్తాబు చేస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు పతంగులను ఎగురవేయడానికి వివిధ రకాల పతంగులు, చరఖాలు, ధారం కొనుగోలు చేస్తారు.  పతంగుల ఎగురవేతలో పిల్లల కేరింతలు, ఆనందోత్సవాల నడుమ పతంగుల సంబరాలతో పండుగ సందడిగా సాగుతుంది. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో వ్యాపారం జోరుగా సాగుతుంది.

బొమ్మల కొలువులు..
సంక్రాంతికి మహిళలు బొమ్మల కొలువులు పెడుతారు. సౌభాగ్యవంతులైన మహిళలు సంక్రాంతి నోములు నోచుకుని మత్తయిదువులను పిలిచి వాటిని కానుకగా అందజేసి ఆశీర్వాదం తీసుకుంటారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యాన్ని స్వీకరిస్తారు. బెల్లం, నువ్వులు ప్రసాదంగా పంచిపెడుతారు. అలాగే సంక్రాంతి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో జాతరలు సైతం నిర్వహిస్తారు.

Updated Date - 2022-01-15T04:04:21+05:30 IST