నడక గోదారి!

ABN , First Publish Date - 2022-05-16T07:03:16+05:30 IST

కూనవరం రుద్రంకోట మధ్య గోదావరిలో పడవ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు గోదావరిలో కాలినడకన ప్రయాణించాల్సి వస్తోంది.

నడక గోదారి!
గోదావరిలో నుంచి వస్తున్న బాటసారులు

కాలినడక గోదావరి దాటేస్తున్నారు

 తగ్గిన నీటిమట్టం 

పడవ తిరిగేందుకు అనుకూలంగా లేదు 

కూనవరం, మే 15: కూనవరం రుద్రంకోట మధ్య గోదావరిలో పడవ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు గోదావరిలో కాలినడకన ప్రయాణించాల్సి వస్తోంది. వేసవి కాలం కావడంతో గోదావరి తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో కాలిరేవు ఏర్పడింది. దీంతో ప్రజలు గోదావరిలో కాలినడకనే అటుఇటు నడిచి వెళుతున్నారు. కచ్చులూరు బోట్‌ ప్రమాదం తరువాత జగన్‌ ప్రభుత్వం కూనవరం-రుద్రంకోట మధ్య గోదావరిలో తిరిగే పడవను నిషేధించింది. మూడేళ్లుగా ఇక్కడ పడవ అధికారికంగా తిరగడంలేదు. వారంరోజుల క్రితం పడవనడిపేందుకు అధికారులు వేలంపాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ గోదావరిలో నీటిమట్టం తక్కువగా ఉందని, పడవ తిరిగేందుకు అనుకూలంగా లేదని వేలంను రద్దు చేశారు. ప్రస్తుతం గోదావరిలో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ పైన వర్షాలు పడితే ఒక్కసారిగా గోదావరిలో నీళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇది గమనించకుండా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తగా గోదావరి దాటాలి. 



Updated Date - 2022-05-16T07:03:16+05:30 IST