Condoms కొనడానికి మెడికల్ షాప్‌నకు వెళ్లిన మహిళ.. అక్కడ ఆమెకు ఎదురైన అనుభవం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-13T21:43:30+05:30 IST

ఆ మహిళ తన భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లింది.. అయితే ఆమె తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లడం మర్చిపోయింది..

Condoms కొనడానికి మెడికల్ షాప్‌నకు వెళ్లిన మహిళ.. అక్కడ ఆమెకు ఎదురైన అనుభవం ఏంటంటే..

ఆ మహిళ తన భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లింది.. అయితే ఆమె తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లడం మర్చిపోయింది.. దాంతో కండోమ్స్ కొనుక్కునేందుకు Walgreens మెడికల్ స్టోర్‌కు వెళ్లింది.. అక్కడ ఉన్న క్లర్క్‌ను తనకు కండోమ్స్ కావాలని అడిగింది.. అయితే అక్కడున్న వ్యక్తి ఆమెకు కండోమ్స్ ఇచ్చేందుకు నిరాకరించాడు.. కండోమ్స్ అమ్మడం తన మతాచారం ప్రకారం నిషేధమని చెప్పాడు. ఆ మహిళ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 




అమెరికాకు చెందిన జెస్సికా అనే మహిళ ఇటీవల తన భర్తతో కలిసి విస్కాన్సిన్‌కు విహారయాత్రకు వెళ్లింది. అక్కడకు గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లకపోవడంతో కండోమ్‌లను కొనుగోలు చేయడానికి హేవార్డ్ నగరంలోని వాల్‌గ్రీన్స్ స్టోర్‌కు వెళ్లింది. అక్కడున్న జాన్ అనే గుమస్తా ఆమెకు కండోమ్స్ విక్రయించేందుకు నిరాకరించాడు. `నా మత విశ్వాసం కారణంగా నేను మీకు వాటిని అమ్మలేను` అని చెప్పడంతో జెస్సికా షాక్ అయింది. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో తన వెనుక చాలా మంది ఉన్నారని, అందరూ మగవారేనని గుర్తించి ఆమె సైలెంట్ అయింది. 


కొద్దిసేపటి తర్వాత స్టోర్ మేనజర్‌ను పిలిచి ఆ గుమస్తా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు మేనేజర్ ఆమెకు కండోమ్స్ విక్రయించాడు. తమ కంపెనీ పాలసీ ప్రకారం ఉద్యోగులకు నైతిక అభ్యంతరం ఉన్న లావాదేవిని తిరస్కరించడానికి లేదా వైదొలగడానికి అనుమతి ఉందని మేనేజర్ పేర్కొన్నాడు. యూఎస్‌లో రెండో అతిపెద్ద ఫార్మసీ చైన్ అయిన వాల్‌గ్రీన్స్ సిబ్బంది ఇలా ప్రవర్తించడం ఇబ్బందికరం అని ఆ మహిళ పేర్కొంది. 

Updated Date - 2022-07-13T21:43:30+05:30 IST