హైదరాబాద్‌లో వేక్‌ఫిట్‌ ఫ్యాక్టరీ

ABN , First Publish Date - 2020-10-27T05:49:09+05:30 IST

స్లీప్‌, హోమ్‌ సొల్యూషన్ల కంపెనీ వేక్‌ఫిట్‌ హైదరాబాద్‌ ఫ్యాక్టరీని ప్రారంభించినట్టు ప్రకటించింది. మల్కాజ్‌గిరి జిల్లాలోని మేడ్చల్‌లో ఈ

హైదరాబాద్‌లో వేక్‌ఫిట్‌ ఫ్యాక్టరీ

హైదరాబాద్‌: స్లీప్‌, హోమ్‌ సొల్యూషన్ల కంపెనీ వేక్‌ఫిట్‌ హైదరాబాద్‌ ఫ్యాక్టరీని ప్రారంభించినట్టు ప్రకటించింది. మల్కాజ్‌గిరి జిల్లాలోని మేడ్చల్‌లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. 2021 నాటికి తాము రూ.450 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ సీఈఓ అంకిత్‌ గార్గ్‌ ఈ సందర్భంగా తెలిపారు.

తాము తయారుచేస్తున్న ఉత్పత్తుల్లో మాట్రెస్‌లు, బెడ్లు, దిండ్లు, బెడ్‌ షీట్లు, నెక్‌ పిల్లోలు, స్టడీ టేబుళ్లు, పుస్తకాల షెల్ఫ్‌లు, కాఫీ టేబుల్స్‌, సోఫాలు, వార్డ్‌రోబ్‌లు ఉన్నట్టు ఆయన చెప్పారు.


Updated Date - 2020-10-27T05:49:09+05:30 IST