ఎదురుచూపులేనా?

ABN , First Publish Date - 2022-09-28T03:42:55+05:30 IST

రైతులపై పంట రుణ భారం పేరుకుపోతోంది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ సకాలంలో పూర్తికాకపోవడం వల్ల తీసుకున్న అప్పులో అస లు కంటే వడ్డీలే అధికమవుతున్నాయి. ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆశతో ఉన్న రైతులు బ్యాంకులో రుణాలను రెన్యూవల్‌ చేసుకోకపోవ డంతో వడ్డీలు పెరిగిపోతున్నాయి.

ఎదురుచూపులేనా?
లోగో

- రుణమాఫీ నిధుల కోసం అన్నదాతల నిరీక్షణ 

- ప్రభుత్వం హామీ ఇచ్చి మూడేళ్లవుతున్నా పట్టింపు లేని వైనం 

- పంట రుణాలు రెన్యూవల్‌ చేసుకోని రైతులు 

రైతులపై పంట రుణ భారం పేరుకుపోతోంది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ సకాలంలో పూర్తికాకపోవడం వల్ల తీసుకున్న అప్పులో అస లు కంటే వడ్డీలే అధికమవుతున్నాయి. ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆశతో ఉన్న రైతులు బ్యాంకులో రుణాలను రెన్యూవల్‌ చేసుకోకపోవ డంతో వడ్డీలు పెరిగిపోతున్నాయి.

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 27: జిల్లా రైతులు పంట రుణా లమాఫీకి ఎదురు చూస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష వరకు పంట రుణ మాఫీ చేయనున్నట్లు ఎన్నికల సమయంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడతగా రూ.25 వేలు రుణ మాఫీ చేయడంతో కొందరు రైతులకు మోదం చెందగా మిగిలిన రైతు లకు చేదం మిగిలింది.  మూడేళ్లుగా రుణ మాఫీ అవుతుందని ఆశతో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరాశకు గురి చేసింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ హామీ అతీగతి లేకుం డా పోయింది. రూ.లక్ష లోపు పంట రుణాలన్నింటిని మాఫీ చేస్తామని ప్రకటించి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం బ్యాంకు రుణాలను మాఫీ చేస్తుందన్న ధీమాతో మూడేళ్లుగా రైతులు బ్యాంకుల వైపు కన్నెత్తి చూడడం లేదు. బ్యాంకర్లు పదే పదే పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకోవాలని చెప్పినా రైతులు పెడచెవిన పెట్టారు. రెన్యూవల్‌ చేయించుకోక పోతే వడ్డీ ఎక్కువ పడుతుందని చెప్పినా పట్టించుకోలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుం దన్న ఆశతోనే డబ్బులు చెల్లించక పోవడంతో ఇప్పుడు వడ్డీ, అసలు కలిపి రెండింతలైన పరిస్థితి నెలకొంది. ఒక వేళ ప్రభుత్వం రుణ మాఫీ చేసినా వచ్చిన సొమ్ము వడ్డీకే సరిపోయే పరిస్థితి ఉంది.  జిల్లాలో దాదా పు 60 వేల మందికి పైగా రైతులు రుణమాఫీ  కోసం ఎదురు చూస్తు న్నారు. 

ఎన్నికల సందర్భంగా..

ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 డిసెంబరు నాటికి రూ.లక్ష లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అనుకున్నట్లుగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో పంట రుణాలు మాఫీ అవుతాయన్న ధీమాతో రైతులు ఉన్నారు. 2018 డిసెంబరు నాటికి రూ.లక్ష లోపు ఉన్న రుణాల జాబితాను పంపించాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. మూడు విడతలుగా అంటే మొదటి విడతలో రూ.25 వేల లోపు ఉన్న రుణాలను, రెండో దశలో రూ.50 వేల లోపు రుణాలను, మూడో విడతలో లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. ప్రభుత్వ సూచన మేరకు జిల్లాలో రుణ మాఫీ కోసం 67,250 మంది రైతులు అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో గతేడాది మొదటి విడతగా 7,042 మంది రైతులు రూ.25 వేల రుణమాఫీ పొందారు.  మిగిలిన రూ. 50వేలు, రూ. లక్ష లోపు రుణాలు ఉన్న 60, 208  మంది రైతులు రుణ మాఫీ కావాల్సి ఉంది. 

మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాం..

- బోయిరే గణపతి, గుండి

మూడేళ్లుగా రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందన్న ధీమాతో పంట రుణం తీసుకోలేదు. వడ్డీ ఎక్కు వైతుందని బ్యాంకు వాళ్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాఫీ చేయనంటే అప్పులు కట్టుకునే వాళ్లం. తిరిగి పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్ల లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి ఆదుకోవాలి.

Updated Date - 2022-09-28T03:42:55+05:30 IST