రేషన్‌ కోసం నిరీక్షణ

ABN , First Publish Date - 2021-07-24T06:09:36+05:30 IST

మూడు రోజులుగా సర్వర్‌ సమస్య అధికం కావడంతో ఉచిత రేషన్‌ తీసుకోవడానికి కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

రేషన్‌ కోసం నిరీక్షణ
ఇస్లాపురంలో రేషన్‌ షాపు వద్ద వేచి ఉన్న లబ్ధిదారులు

పెనుకొండ రూరల్‌, జూలై 23: మూడు రోజులుగా సర్వర్‌ సమస్య అధికం కావడంతో ఉచిత రేషన్‌ తీసుకోవడానికి కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో మొత్తం 37 ఎఫ్‌పీ షాపులుండగా.. 16,400 మంది కార్డుదారులున్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ యోజన పథకం కింద ఉచిత రేషన్‌ను మూడు రోజుల నుంచి ఇస్తున్నారు. అప్పటి నుంచి సర్వర్‌ సమస్య ఉండటంతో రోజూ ఉదయం నుంచి సా యంత్రం వరకు ఎఫ్‌పీ షాపుల వద్దకు వెళ్లి వేచి ఉండి నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. శుక్రవారం కూడా ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు రేషన్‌ షాపుల వద్ద పడిగాపులు కాశారు.


Updated Date - 2021-07-24T06:09:36+05:30 IST