బార్లు, థియేటర్లకు లేని ఆంక్షలు స్కూళ్లకెందుకు?

ABN , First Publish Date - 2022-01-20T05:48:27+05:30 IST

బార్లు, థియేటర్లకు లేని ఆంక్షలు స్కూళ్లకెందుకు?

బార్లు, థియేటర్లకు లేని ఆంక్షలు స్కూళ్లకెందుకు?

‘వడుప్సా’ వరంగల్‌ జోన్‌ అధ్యక్షుడు బిల్ల రవి 


వరంగల్‌ టౌన్‌, జనవరి 19 : రాష్ట్రంలో బార్లు, థియేటర్లు ఫంక్ష న్‌ హాళ్లకు లేని కొవిడ్‌ ఆంక్షలు పాఠశాలలకు ఎందుకని వడుప్సా వరంగల్‌జోన్‌ అధ్యక్షుడు బిల్ల రవి ప్రశ్నించారు. కాశిబుగ్గలోని స్కాల ర్స్‌ స్కూల్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమవేశంలో బిల్ల రవి మాట్లాడుతూ.. కొవిడ్‌-19తో ప్రైవే ట్‌ పాఠశాలలు ఇప్పటికే భారీగా నష్టపోయాయని, ఇటీవలే పునఃప్రారంభం కాగా మళ్లీ సంక్రాంతి సెలవుల తర్వాత కొవిడ్‌ పేరుతో ఈ నెల 30 వరకు పెంచారని తెలిపారు. దీంతో బడ్జెట్‌ పాఠశాలలు నష్టపోతున్నాయని, విద్యార్థు ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. 

ట్రస్మా రాష్ట్ర కోశాధికారి కొమ్మినేని భూపాల్‌ రావు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి విద్యా ర్థులు చదువుకునేది బడ్జెట్‌ పాఠశాలల్లోనేనని అ న్నారు. అందరికీ ఆన్‌లైన్‌ విద్యను అందించలేమ ని, స్కూళ్లమూసివేత నిర్ణయాలు కార్పొరేట్‌ పాఠ శాలలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించా రు. తరగతులు లేక విద్యార్థులు పోటీ పరీక్షల్లో వెనుకబడి పోతున్నారని తెలిపారు. ఇప్పటికే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు టీకాలు వే యడం పూర్తయిన నేపథ్యంలో వారికి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్ర మంలో జోన్‌ కార్యదర్శి కొడిమల రవి, కోశాధికారి ముక్కెర రవీందర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దాసి సతీ్‌ష్‌మూర్తి, మీడియా కన్వీనర్‌ కూచన క్రాంతి కుమార్‌, ప్రొఫెషనల్‌ కన్వీనర్‌ జన్ను విలియమ్స్‌, కల్చరల్‌ కన్వీనర్‌ సుధీర్‌, స్పొర్ట్స్‌ కన్వీనర్‌ వెల్పు గొండ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:48:27+05:30 IST