అమ్మవారి హుండీ ఆదాయం రూ.28 లక్షలు

ABN , First Publish Date - 2020-10-29T08:06:58+05:30 IST

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. కొవిడ్‌ నిబంధనలతో భక్తులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు.

అమ్మవారి హుండీ ఆదాయం రూ.28 లక్షలు

భారీగా తగ్గిన వైనం


విజయనగరం రూరల్‌, అక్టోబరు 28: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. కొవిడ్‌ నిబంధనలతో భక్తులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు. మొక్కులు తీర్చుకున్నదీ అరుదే. తొలేళ్లు, సిరిమాను ఊరేగింపు రోజుల్లో కూడా తక్కువ మందికే ఆలయ ప్రవేశం కల్పించారు. ఈ ప్రభావం ఆదాయంపై పడింది. బుధవారం హుండీలను లెక్కించగా కేవలం రూ.28.28లక్షలే వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది కనీసం రూ.50లక్షల నుంచి రూ.55 లక్షల మేరకు ఆదాయం వస్తుందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. బంగారం 88 గ్రాములు, వెండి 66 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. ఈ నెల 17 నుంచి మంగళవారం వరకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించామని చెప్పారు. b

Updated Date - 2020-10-29T08:06:58+05:30 IST