గర్భిణుల వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-10-28T07:59:26+05:30 IST

గర్భిణుల వసతి గృహాల్లో మెరుగైన సేవలందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మనాఽథ్‌ అన్నారు.

గర్భిణుల వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి

పార్వతీపురం, అక్టోబరు 27: గర్భిణుల వసతి గృహాల్లో మెరుగైన సేవలందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మనాఽథ్‌ అన్నారు. సోమవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశం మందిరంలో ఉప వైద్య ఆరోగ్య అధికారి, మెడికల్‌ ఆఫీసర్లు, వైటీసీ మేనేజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆ యన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల్లో ప్రసవాలను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టా లన్నారు. వసతి గృహాల్లో మంచి ఆహారం అందించాలని, వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని మెడికల్‌ ఆఫీసర్లకు సూచించారు. 


సాలూరు: గిరిశిఖర గ్రామాల వసతి గృహాల్లో ఉన్న గర్భిణులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు. పట్టణం లోని వైటీసీ కేంద్రంలో ఉన్న గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహాన్ని ఆయన మంగళవారం సందర్శించారు.   మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందుతున్నాయా..., వైద్య పరీక్షలు చేస్తున్నారా లేదా అనే విషయాలను అడి గి తెలుసుకున్నారు.  మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అందజేయాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు వైటీసీ మేనేజర్‌ ప్రశాంత్‌, మెట్రీన్‌ శోభ  ఉన్నారు.

 

నిర్మాణాలు వేగవంతం 

మక్కువ: సచివాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని  ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు. మండలంలోని మక్కువ, కవిరిపల్లి, మార్కొండపుట్టి గ్రామాల్లో సచివాలయ భవన నిర్మాణాలను ఆయన మంగళవారం పరిశీలించారు. పనుల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు లేకుండా, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం మార్కొండపుట్టి సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-28T07:59:26+05:30 IST