భూసేకరణలో పురోగతి లేకుంటే చర్యలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-10-02T09:31:04+05:30 IST

భోగాపురం ఎయిర్‌ పోర్టు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో పురోగతి చూపని వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ హెచ్చరించారు.

భూసేకరణలో పురోగతి లేకుంటే చర్యలు : కలెక్టర్‌

కలెక్టరేట్‌, అక్టోబరు 1:  భోగాపురం ఎయిర్‌ పోర్టు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో పురోగతి చూపని వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ హెచ్చరించారు. గురువారం సాయంత్రం తన చాంబర్‌లో జేసీ కిషోర్‌కుమార్‌తో కలిసి  ఆయా శాఖాధికారులతో సమీక్షించారు. పనుల్లో ఆశించిన ప్రగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాం తరాలను అధిగ మించి ఎయిర్‌పోర్టు భూసేకరణ  వేగ వంతం చేయాలన్నారు. 


విజయనగరం ఆర్డీవో భవానీ శంకర్‌, ఉపకలెక్టర్లు జయరాం, వెంటేశ్వర్లు, బాలా త్రిపుర సుందరి, సాల్మన్‌ రాజు, తహసీల్దార్లు ఉన్నారు. ఫ జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద జిల్లాలోని వివిధ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ తెలి పారు. పూర్తి వివరాలకు విజయనగరం ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.


 సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలి

విజయనగరం రూరల్‌:  స్వచ్ఛంద సంస్థలు తమ  సేవా కార్యక్రమాలను మరిం తగా విస్తృతం చేయాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ సూచించారు. నేచర్‌ సంస్థ విజయనగరం చైర్మన్‌గా  నియమితులైన ఎస్‌.వికాస్‌బాలరాజ్‌ గురువారం కలెక్టర్‌ని కలిసి, సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమా లను వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ..  సమాజానికి ఉపయోగపడే  పనులు చేపట్టి నేచర్‌ సంస్థ పేరును మరింత ఇనుమడింపజేయాలన్నారు.  ఆ సంస్థ ప్రతినిధులు ఎస్‌.రంజిత, కె.బంగారుబాబు, జీకే దుర్గ, జీఎస్‌వీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-02T09:31:04+05:30 IST