ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఎదుట కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2020-09-29T12:02:19+05:30 IST

స్థానిక ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో మందులు, రక్తపరీక్షలు, టీటీ ఇంజక్షన్లు వంటివి లేకపోవడంపై కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకుడు పొట్నూరు శంకరరావు ఆధ్వర్యంలో సోమవారం డిస్పెన్సరీ ఎదుట వారు ధర్నా చేశారు.

ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఎదుట కార్మికుల ధర్నా

 బొబ్బిలి, సెప్టెంబరు 28 : స్థానిక ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో మందులు, రక్తపరీక్షలు, టీటీ ఇంజక్షన్లు వంటివి లేకపోవడంపై కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకుడు పొట్నూరు శంకరరావు ఆధ్వర్యంలో సోమవారం డిస్పెన్సరీ  ఎదుట వారు  ధర్నా చేశారు. మునిసిపల్‌, జూట్‌, గ్రోత్‌సెంటరు కార్మికుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ  వైద్య సేవలు మాత్రం శూన్యమని తెలిపారు.


వారానికి రెండు రోజులు మాత్రమే వైద్యులు వస్తున్నారని ఆరోపించారు. మందులు , రక్తపరీక్షలు లేకుండా ఏమి వైద్యం చేస్తారని ప్రశ్నించారు. పూర్తిస్థాయి డాక్టర్‌, సిబ్బందిని నియమించి మెరుగైన వైద్యసేవలు అందించాలని, డిస్పెన్సరీ స్థాయిని పెంచాలని కార్మికులు  నినాదాలు చేశారు. 

Updated Date - 2020-09-29T12:02:19+05:30 IST