Abn logo
May 23 2020 @ 15:35PM

దర్శకేంద్రుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న `వైజయంతీ మూవీస్`!

వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఎన్నో మరపురాని చిత్రాలు తెరకెక్కాయి. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో రాఘవేంద్రరావు 14 సినిమాలను తెరకెక్కించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోలను వెండితెరకు పరిచయం చేసింది వీరే. 


ఈ రోజు (శనివారం) రాఘవేంద్రరావు జన్మదినోత్సవం. ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్ సంస్థ ట్విటర్ ద్వారా రాఘవేంద్రరావుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. `కొన్ని బంధాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. హ్యాపీ బర్త్‌డే రాఘవేంద్రరావు` అంటూ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. అలాగే రాఘవేంద్రరావు గురించి ఓ వీడియోను విడుదల చేసింది. 



Advertisement
Advertisement
Advertisement