Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 14 Aug 2022 16:34:35 IST

Indra 4k : రిలీజ్‌పై క్లారిటీ వచ్చింది !

twitter-iconwatsapp-iconfb-icon

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) ‘పోకిరి’ (Pokiri) రీరిలీజ్‌తో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఆ సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని.. మిగతా స్టార్ హీరోల సినిమాల్ని కూడా 4K ప్రింట్స్‌తో థియేటర్స్ లోకి దింపడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్‌లో ముందుగా విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) తొలి కలయికలో తెరకెక్కిన ‘జల్సా’ (Jalsa).  14 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, త్రివిక్రమ్ స్టైలాఫ్ డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలిచిపోయాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా సెప్టెంబర్ 2న ఈ సినిమా 4K ప్రింట్ విడుదల కాబోతోంది. 

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన సెన్సేషనల్ మూవీ ‘ఇంద్ర’ (Indra) కూడా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఇటీవల 20 ఏళ్ళను పూర్తి చేసుకుంది. దీని 4K ప్రింట్ చిరు బర్త్ డే సందర్భంగా విడుదలవుతోందంటూ.. ఒకటే వార్తలు వినిపిస్తున్నాయి. చిరు నటించిన మొదటి, చివరి ఫ్యాక్షన్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా అప్పట్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. చిరు డైలాగ్స్, వీణ స్టెప్ అప్పట్లో సంచలనంగా మారాయి. అలాంటి సినిమా ఇప్పటి సరికొత్త టెక్నాలజీతో మళ్ళీ విడుదల కానున్నందుకు అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. అయితే ఈ వార్తలపై వైజయంతి మూవీస్ (Vyjayanthi movies) వారు స్పందించి విడుదలపై క్లారిటీ ఇచ్చారు. 

‘ప్రియమైన మెగాస్టార్ అభిమానులకు.. మీకే కాదు మాకు కూడా ఈ సినిమా 4K ప్రింట్ విడుదల చేస్తే బాగుంటుందనిపిస్తోంది. కానీ ఇప్పుడు కాదు. దానికి కొంత టైమ్ పడుతుంది. కానీ రిలీజ్ మాత్రం భారీ ఎత్తున చాలా గ్రాండ్‌గా ఉంటుంది’... అంటూ ట్వీట్ చేసింది వైజయంతి మూవీస్ సంస్థ. దాంతో మెగాభిమానులు కాస్త డిజ్పాయింట్ అయినా.. సినిమా రీరిలీజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని మేకర్స్ తెలపడంతో విడుదల కోసం ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు.  మరి ఇంద్ర రీరిలీజ్ సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement