Abn logo
Apr 12 2021 @ 22:13PM

363 ఆర్‌బికేల్లో మాత్రమే ఏహెచ్‌ఏల నియామకం

 పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామిరెడ్డి

 మనుబోలు, ఏప్రిల్‌ 12: జిల్లాలో 620 రైతు భరోసా కేంద్రాలుండగా, ఇప్పటికీ 363లో మాత్రమే గ్రామ పశువైద్యసహాయకుల(అనిమల్‌ హస్‌బెండరీ అసిస్టెంట్‌)ను నియమించామని జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సం చాలకులు వెంకటస్వామిరెడ్డి తెలిపారు. స్థానిక పశువైద్యశాల లో సోమవారం ఏహెచ్‌ఏలు, పశువైద్యాధికారులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు, ఐదు గ్రామాలకు కలిపి ఒక పశువైద్యశాల ఉం టుందన్నారు. కావున ఆర్‌బికేల్లో ఏర్పాటు చేసిన ఏహెచ్‌ఏలు క్షేత్రస్థాయిలో వైద్యం అందిస్తారన్నారు. ప్రభుత్వం వైద్యశాలల పనివేళలు మార్చిందన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5వరకు పనిచేస్తాయన్నారు. ఆర్‌బికేలో వ్యవసాయ సహాయ కులతోపాటు పశువైద్య సహాయకులు ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇంకా 4వేల యూనిట్లకు పశునష్టపరిహారం అందాల్సి ఉందన్నారు. దాణా అయితే కేవలం ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తున్నామన్నారు.  కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ నరసింహారావు, ఏడి గురవారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement