నిజామాబాద్: ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ స్పందించింది. తెలంగాణ సీఎస్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నిజామాబాద్ సీపీ, కలెక్టర్‌కి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా స్పీకర్ ఓం బిర్లాకి నివేదిక ఇవ్వాలని పార్లమెంటరీ ప్రివిలేజ్, ఎథిక్స్ కమిటీ ఆదేశించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తనపై జరిగిన దాడి ఘటనపై ఆయన ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి