ఉయ్యూరులో ప్రైవేట్‌ ల్యాబ్‌ల దోపిడీ

ABN , First Publish Date - 2021-05-18T06:06:19+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఉయ్యూరులోని కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాహకులు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారు.

ఉయ్యూరులో  ప్రైవేట్‌ ల్యాబ్‌ల దోపిడీ

ర్యాపిడ్‌ టెస్ట్‌కు రూ.2 వేలు వసూలు!

ఉయ్యూరు, మే 17 : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఉయ్యూరులోని కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాహకులు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాబ్‌లలో కొవిడ్‌ పరీక్షలు చేస్తూ  ప్రజలను దోచు కుం టున్నారు.  కరోనా అనుమానంతో వచ్చే వారి నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ మొత్తం తీసుకుంటున్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌కు మొదట్లో రూ.500 తీసుకునే ల్యాబ్‌లు ప్రస్తుతం రూ.2 వేల వరకు వసూలు చేస్తుండడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్ష చేసి నోటి మాటతో మాత్రమే రిపోర్టు చెప్పి పంపుతున్నారు. దీంతో ల్యాబ్‌ల పరీక్షల రిపోర్టులపైనే  అనుమానాలు తలెత్తుతున్నాయి.  దీని కారణంగా పాజిటివ్‌ వచ్చిన వారు కూడా ఇష్టాను సారంగా బయట తిరుగుతూ మరింత మందికి వైరస్‌ వ్యాప్తి చెందేలా చేస్తున్నారన్న ఆందోళన  ప్రజల్లో నెలకొంది. ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి  అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్‌  ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  

Updated Date - 2021-05-18T06:06:19+05:30 IST