‘ఆదిశంకర’తో వీఎస్‌యూ ఒప్పందం

ABN , First Publish Date - 2022-08-13T04:50:51+05:30 IST

తిరుపతి జిల్లా గూడూరు వద్ద ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్‌ కళాశాల అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ( ఏసీఐసీ )తో విక్రమ సింహపురి యూనివర్సిటీ శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

‘ఆదిశంకర’తో వీఎస్‌యూ ఒప్పందం
ఆదిశంకర కళాశాలతో అవగాహన ఒప్పందం చేసుకుంటున్న వీసీ సుందరవల్లి, రిజిస్ర్టార్‌ రామచంద్రారెడ్డి

వెంకటాచలం, ఆగస్టు 12 : తిరుపతి జిల్లా గూడూరు వద్ద ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్‌ కళాశాల అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ( ఏసీఐసీ )తో  విక్రమ సింహపురి యూనివర్సిటీ శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఎంవోయూపై సంతకాలు చేశాయి. వీఎస్‌యూ వీసీ సుందరవల్లి మాట్లాడుతూ ఒప్పందం ద్వారా విద్యార్థుల్లో ఆలోచన సామర్థ్యాలు, పరిశోధన, సహకార ప్రాజెక్టులు, సాంకేతిక అభివృద్ధి, విద్యా కార్యక్రమాలను సులభతరం  చేయవచ్చునని తెలిపారు. ఆదిశంకర కళాశాలలో ఉన్న ఏసీఐసీ ద్వారా అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు, కొత్త నైపుణ్యాలను సన్నద్ధం చేయడానికి ఈ కార్యకలాపాలు వేదికగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ అధికారులు విజయానంద్‌ కుమార్‌ బాబు, డాక్టర్‌ సీహెచ్‌ విజయ, డాక్టర్‌ ఎస్‌బీ సాయినాథ్‌, ఆదిశంకర కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ. మోహన్‌, డాక్టర్‌ లోకనాఽథం, డాక్టర్‌ ఎ. ఇమ్మాన్యుయేల్‌, డాక్టర్‌ ఎం. రాజయ్య తదితరులున్నారు. 

Updated Date - 2022-08-13T04:50:51+05:30 IST