ఉక్కు ఉద్యమానికి సీఎం నాయకత్వం వహించాలి

ABN , First Publish Date - 2021-04-11T06:19:10+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి నాయకత్వం వహించాలని జీవీఎంసీ తెలుగుదేశం ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ఉక్కు ఉద్యమానికి సీఎం నాయకత్వం వహించాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాస్‌. సమావేశంలో కార్పొరేటర్లు, నాయకులు

జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి నాయకత్వం వహించాలని జీవీఎంసీ తెలుగుదేశం ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌  డిమాండ్‌ చేశారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తక్షణమే అసెంబ్లీ సమావేశపర్చి తీర్మానం చేయాలన్నారు.  నగరంలో నీటి ఎద్దడిపై చర్చించేందుకు జీవీఎంసీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.  67వ వారు ్డకార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖలో భూములను ప్రభుత్వం విక్రయించాలనుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. 31వ వార్డు కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్‌ మాట్లాడుతూ జీవీఎంసీ సమావేశం కనీసం రెండు రోజులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 86వ వార్డు కార్పొరేటర్‌ లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ  కౌన్సిల్‌ రాక ముందే ఫిబ్రవరిలో  రూపొందించిన బడ్జెట్‌ను ఇప్పుడు ఆమోదించాలని అధికారులు చెప్పడం సరికాదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులపై చర్చించి సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నందున ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో 94వ వార్డు కార్పొరేటర్‌ బళ్ల శ్రీనివాసరావు, పార్టీ విశాఖ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు మొల్లి లక్ష్మణరావు, సనపల పాండురంగారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-11T06:19:10+05:30 IST