ఖేలో ఇండియా టాలెంట్‌ కమిటీలో శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-01-16T05:44:47+05:30 IST

ఖేలో ఇండియా టాలెంట్‌ ఐడెంటిఫికేషన్‌ జోనల్‌ కమిటీ(బాక్సింగ్‌) సభ్యుడిగా వాల్తేరు రైల్వే స్పోర్టు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి, రైల్వే స్పోర్ట్సు ప్రమోషన్‌ బోర్డు(పీఎస్‌ఆర్‌బీ) బాక్సింగ్‌ కోచ్‌ రెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు.

ఖేలో ఇండియా టాలెంట్‌ కమిటీలో శ్రీనివాసరావు

విశాఖపట్నం(స్పోర్ట్సు), జనవరి 15: ఖేలో ఇండియా టాలెంట్‌ ఐడెంటిఫికేషన్‌  జోనల్‌ కమిటీ(బాక్సింగ్‌) సభ్యుడిగా వాల్తేరు రైల్వే స్పోర్టు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి, రైల్వే స్పోర్ట్సు ప్రమోషన్‌ బోర్డు(పీఎస్‌ఆర్‌బీ) బాక్సింగ్‌ కోచ్‌ రెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు. అంతర్జాతీయ బాక్సింగ్‌ కోచ్‌గా గుర్తింపు పొందిన శ్రీనివాసరావు ఖేలో ఇండియా జోనల్‌ కమిటీ సభ్యుడిగా దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ర్టాలలో ప్రతిభ గల బాక్సింగ్‌ క్రీడాకారులను గుర్తించడంతోపాటు గ్రాస్‌ రూట్‌ లెవెల్‌లో బాక్సర్లను తీర్చిదిద్దే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఖేలో ఇండియా టాలెంట్‌ ఐడెంటిఫికేషన్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ (బాక్సింగ్‌) సభ్యురాలుగా ఇండియన్‌ రైల్వే వుమెన్‌ బాక్సింగ్‌ కోచ్‌, ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీత ఎన్‌.ఉష నియమితులయ్యారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ, స్పోర్ట్సు ఆఫీసర్‌ ప్రదీప్‌ యాదవ్‌లు అభినందించారు.


Updated Date - 2021-01-16T05:44:47+05:30 IST