రైల్వే బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు అభినందన

ABN , First Publish Date - 2021-04-13T06:08:40+05:30 IST

జాతీయ సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఇండియన్‌ రైల్వే స్వర్ణ పతకం సాధించి స్టార్‌ ఆఫ్‌ ఇండియా టైటిల్‌ సొంతం చేసుకున్నదని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.

రైల్వే బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు అభినందన
రైల్వే బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు వెంగళరావు, గణేశ్‌లను అభినందిస్తున్న స్పోర్ట్సు ఆఫీసర్‌ ప్రదీప్‌ యాదవ్‌

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఏప్రిల్‌ 12: జాతీయ సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో  ఇండియన్‌ రైల్వే స్వర్ణ పతకం సాధించి స్టార్‌ ఆఫ్‌ ఇండియా టైటిల్‌ సొంతం చేసుకున్నదని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. జైపూర్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్స్‌లో రైల్వే జట్టు 35-27, 35-29 స్కోరు తేడాతో తమిళనాడు విజయం సాధించిందని పేర్కొన్నారు. ఇండియన్‌ రైల్వే జట్టుకు వాల్తేరు డివిజన్‌ ఆటగాళ్లు వెంగళరావు, గణేశ్‌లు ప్రాతినిధ్యం వహించారన్నారు ఈ సందర్భంగా సోమవారం డీఆర్‌ఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వాల్తేరు డివిజన్‌ స్పోర్ట్సు ఆఫీసర్‌ ప్రదీప్‌ యాదవ్‌ హాజరై వేణుగోపాలరావు, గణేశ్‌లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాయ క్రీడాధికారులు బి.అవినాష్‌, ఎం.హరినాథ్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ ఇన్‌చార్జి ఆఫీసర్‌ వి.రాంబాబు, రైల్వే స్పోర్ట్సు ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T06:08:40+05:30 IST