Abn logo
Oct 2 2020 @ 04:30AM

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

 అధికారులకు ఎమ్మెల్యే బాబూరావు ఆదేశం


పాయకరావుపేట, అక్టోబరు 1 : నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆదేశించారు. గురువారం ఇక్కడి అతిథి గృహంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.  గ్రామాల్లో   సచివాలయ, రైతు భరోసా, పాఠశాలు, అంగన్‌వాడీ భవనాలు తదితర పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు.


జెడ్పీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ చిక్కాల రామారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏఈలు అందుబాటులో లేకపోగా, నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్‌ సరఫరా చేయని కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ప్రత్యేకాధికారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వి.రవికుమార్‌ పంచాయతీల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.


అనంతరం అతిథి గృహం ఆవరణలో  నిర్మించిన పీఆర్‌ కార్యాలయం అదనపు భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఏపీ హౌసింగ్‌ ఈఈ డి.రాజేంద్రప్రసాద్‌, పీఆర్‌ డీఈలు వై.పోలీసు, కుమార్‌రాజా, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ కె.పద్మజ, ఇరిగేషన్‌ డీఈ దుర్గారాణి, నాయకులు ధనిశెట్టి బాబూరావు, వీసం రామకృష్ణ, దగ్గుపల్లి సాయిబాబా, లంక సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement