రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2020-10-01T08:23:22+05:30 IST

కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నరసింగరావు దుయ్యబట్టారు

రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నరసింగరావు

 

ఆశీల్‌మెట్ట, సెప్టెంబరు 30: కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నరసింగరావు దుయ్యబట్టారు. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద రెండో రోజు బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


ఈ బిల్లును కేంద్రం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు నాడు చేసిన వాగ్దానాన్ని బీజేపీ నిలబెట్టుకోలేదని, ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం మానేసి రూ.వేల కోట్లు బ్యాంకులకు టోకరా వేసిన 36 మంది విదేశాలకు వెళ్లిపోయేందుకు ఎర్ర తివాచీ పరిచిందన్నారు.


రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో వైసీపీ ప్రభుత్వం 1.25 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని అప్పుల ఊబిలో నెట్టిందన్నారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు ఎం.పైడిరాజు, ఆర్కేఎస్వీ కుమార్‌, వై.కొండయ్య, గణేశ్‌పాండా, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T08:23:22+05:30 IST