దేవదాయ శాఖలో ఇదేమి దుస్థితి

ABN , First Publish Date - 2020-10-01T08:05:46+05:30 IST

రాష్ట్రంలో మంత్రులేమో మూడో తేదీన అన్నిరకాల అలవెన్సులతో పూర్తి జీతం తీసుకుంటూ...వారి శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి సగమే జీతాలు ఇస్తున్నారని...దేవదాయ శాఖలో ఈ బాగోతం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు విమర్శించారు.

దేవదాయ శాఖలో ఇదేమి దుస్థితి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు


విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంత్రులేమో మూడో తేదీన అన్నిరకాల అలవెన్సులతో పూర్తి జీతం తీసుకుంటూ...వారి శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి సగమే జీతాలు ఇస్తున్నారని...దేవదాయ శాఖలో ఈ బాగోతం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ సింహాచలం దేవస్థానం ప్రాశస్త్యం గుర్తించిన కేంద్రం ‘ప్రసాద్‌’ పథకం కింద అభివృద్ధికి రూ.53 కోట్లు మంజూరు చేసిందని, అటువంటి దేవస్థానంలో కరోనా వచ్చిన దగ్గర నుంచి సిబ్బందికి సగం జీతాలే ఇస్తున్నారని, ఇదేమి విడ్డూరమని ప్రశ్నించారు.


దేవుడికి సేవ చేసే వారికి కూడా పూర్తి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో దేవస్థానం ఉందా? అని ప్రశ్నించారు. వారి సమస్య పరిష్కరించలేనప్పుడు మంత్రి పూర్తి జీతం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలకు ఏడాదిన్నర నుంచి రాయితీలు ఇవ్వడం లేదని, ఇలాగైతే పెట్డుబడిదారులు రాష్ట్రానికి ఎలా వస్తారో పాలకులు చెప్పాలన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు రవీంద్ర,  పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగపతిరాజా, శివాజీ బుద్ధరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T08:05:46+05:30 IST