సినిమా థియేటర్లకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-10-01T08:03:05+05:30 IST

ఆరు నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అన్‌లాక్‌ 5.0 నిబంధనల సడలింపులో భాగంగా సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లలో అక్టోబరు 15 నుంచి ప్రదర్శనలకు అనుమతించింది.

సినిమా థియేటర్లకు గ్రీన్‌సిగ్నల్‌

అక్టోబరు 15 నుంచి పునఃప్రారంభం


విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆరు నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అన్‌లాక్‌ 5.0 నిబంధనల సడలింపులో భాగంగా సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లలో అక్టోబరు 15 నుంచి ప్రదర్శనలకు అనుమతించింది. అయితే సీటింగ్‌ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే ప్రేక్షకులు వుండాలని, మిగిలిన కొవిడ్‌ నిబంధనలు అన్నీ అమలు చేయాలని సూచించింది.


కంటెయిన్‌మెంట్‌ జోన్‌ వెలుపల వున్న ప్రాంతాల్లోనే తెరవాలని స్పష్టంచేసింది. విశాఖపట్నం జిల్లాలో సుమారు 150 వరకు సినిమా థియేటర్లు ఉన్నాయి. కరోనాతో వీటిని మార్చి నెలాఖరు నుంచి మూసేశారు. వీటిపై ఆధారపడిన కుటుంబాలన్నీ గత్యంతరం లేక వేరే ఉపాధి చూసుకోవలసి వచ్చింది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోనుండడంతో వారంతా తిరిగి విధుల్లో చేరాలని భావిస్తున్నారు. కేంద్రం స్విమ్మింగ్‌ పూల్స్‌ను కూడా నడుపుకోవచ్చునని పేర్కొంది.  

Updated Date - 2020-10-01T08:03:05+05:30 IST