కరోనా వ్యాప్తికి పీటీడీ అడ్డుకట్ట

ABN , First Publish Date - 2020-09-23T08:00:32+05:30 IST

కరోనా వ్యాప్తి నివారణకు పీటీడీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ నెల 19 నుంచి సిటీ బస్సులు తిరుగుతున్నాయి.

కరోనా వ్యాప్తికి పీటీడీ అడ్డుకట్ట

ఎప్పటికప్పుడు బస్సులు శానిటైజేషన్‌



ద్వారకాబస్‌స్టేషన్‌, సెప్టెంబరు 22: కరోనా వ్యాప్తి నివారణకు పీటీడీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం చర్యలు చేపట్టింది.  ఈ నెల 19 నుంచి సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పీటీడీ అధికారులు బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. డిపో గ్యారేజీకి బస్సు వచ్చిన వెంటనే దాని లోపల, వెలుపల సోడియం హైపో క్లోరైడ్‌ లిక్విడ్‌ను స్ర్పే చేస్తున్నారు.


బస్సులో డ్రైవర్లు, కండక్టర్లు శానిటైజర్లతో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచనలు చేశారు. డిపోల్లోను, టికెట్‌ కౌంటర్లలో రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. బస్సు ఎక్కే ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలన్న నిబంధన పెట్టారు. డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ అప్పలనాయుడు పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపడుతున్నారు. 

Updated Date - 2020-09-23T08:00:32+05:30 IST