పొదల్లో కుళ్లిన మృతదేహం

ABN , First Publish Date - 2020-09-23T08:07:50+05:30 IST

రుషికొండలోని బేపార్కు హోటల్‌ ఎదురుగా ఉన్న తీర ప్రాంతంలోని పొదల్లో గుర్తు పట్టని విధంగా ఉన్న మృతదేహాన్ని ఆరిలోవ పోలీసులు గుర్తించారు. ఆరిలోవ ఎస్‌ఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం..

పొదల్లో కుళ్లిన మృతదేహం

గుడ్లవానిపాలేనికి చెందిన యువకుడిదిగా గుర్తింపు



ఎండాడ, సెప్టెంబరు 22: రుషికొండలోని బేపార్కు హోటల్‌ ఎదురుగా ఉన్న తీర ప్రాంతంలోని పొదల్లో గుర్తు పట్టని విధంగా ఉన్న మృతదేహాన్ని ఆరిలోవ పోలీసులు గుర్తించారు.  ఆరిలోవ ఎస్‌ఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రుషికొండ బీచ్‌లో ఫొటో షూట్‌ నిమిత్తం పలువురు తీరం వెంబడి వెళుతుండగా దుర్గంధం రావడంతో అటుగా వెళ్లి చూస్తే కుళ్లిన మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.


చుట్టుపక్కల వారి ద్వారా సమాచారం తెలుసుకున్న స్థానికులు ఈ మృతదేహం గుడ్లవానిపాలేనికి చెందిన యువకుడిదిగా అనుమానం వ్యక్తం చేశారు. ఆగస్టు రెండు నుంచి కర్రి అప్పలరెడ్డి (35) అనే యువకుడు కనిపించడం లేదంటూ అప్పట్లో ఆరిలోవ పోలీసులు నమోదు చేశారు.


ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి అక్కడ పడివున్న మొబైల్‌, చెప్పులు, జీన్‌ ఫ్యాంట్‌ ఆఽధారంగా మృతదేహం అప్పలరెడ్డిదేనని గుర్తించారు. అప్పలరెడ్డి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-23T08:07:50+05:30 IST