ప్రీమియర్‌ క్రికెట్‌ చాంపియన్‌ రిచ్‌మాండ్‌ రైడర్స్‌

ABN , First Publish Date - 2021-02-28T06:37:52+05:30 IST

వాల్తేరు రైల్వే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన టీ20 ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌ సీజన్‌-1 టోర్నీలో రిచ్‌మాండ్‌ రైడర్స్‌ చాంపియన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ప్రీమియర్‌ క్రికెట్‌ చాంపియన్‌ రిచ్‌మాండ్‌ రైడర్స్‌
విజేత రిచ్‌మాండ్‌ రైడర్స్‌ జట్టు

ఉత్కంఠ పోరులో టెడ్డీ స్ర్టైకర్స్‌ ఓటమి

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఫిబ్రవరి 27: వాల్తేరు రైల్వే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన టీ20 ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌ సీజన్‌-1 టోర్నీలో రిచ్‌మాండ్‌ రైడర్స్‌ చాంపియన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. చివరి బంతి వరకు పోరాడిన టెడ్డీ స్ర్టైకర్స్‌ అనూహ్య ఓటమితో రన్నరప్‌గా నిలిచింది.  శనివారం ఉత్కంఠంగా సాగిన ఫైనల్స్‌లో రిచ్‌మాండ్‌ రైడర్స్‌ ఒక పరుగు తేడాతో టెడ్డీ స్ర్టైకర్స్‌పై విజయం సాధించి చాంపియన్‌ ట్రోఫీతోపాటు రూ.లక్ష నగదు బహుమతిని సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత  బ్యాటింగ్‌కు దిగిన రిచ్‌మాండ్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగుల స్కోరు చేసింది. కెప్టెన్‌ ఎస్‌హెచ్‌.శ్రీనివాస్‌ అజేయ అర్ధ సెంచరీ (51 నాటౌట్‌), యుఏవీ.వర్మ (34), ఎం.హేమంత్‌రెడ్డి (27) రాణించారు. టెడ్డీ స్ర్టైకర్స్‌లో జి.రోహిత్‌, కె.వంశీకృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 161 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన టెడ్డీ స్ర్టైకర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 160 పరుగుల స్కోరు చేసి కేవలం ఒక్క పరుగు తేడాతో అనూహ్య ఓటమి చవిచూసింది. కశ్యప్‌ప్రకాశ్‌ (24), శరణ్‌ తేజ (32), ధీరజ్‌ లక్ష్మణ్‌(25), కె.సాయి రాహుల్‌ (41 నాటౌట్‌) రాణించినా ఫలితం లేకపోయింది.  టోర్నీ ముగింపు కార్యక్రమానికి ప్రకృతి అవెన్యూస్‌ డైరెక్టర్‌ ఎం.అంజిబాబు ముఖ్య అతిఽథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీఏ సంయుక్త కార్యదర్శి సీపీ రెడ్డి,  టోర్నీ నిర్వాహకులు విద్యాసాగర్‌, శ్రీకాంత్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-28T06:37:52+05:30 IST