ఏసీబీ వలలో వీఆర్వో

ABN , First Publish Date - 2021-03-17T22:39:01+05:30 IST

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఓ రైతు

ఏసీబీ వలలో వీఆర్వో

చిత్తూరు: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి వీఆర్వో రాజశేఖర్ పట్టుబడ్డాడు. రామసముద్రం మండలంలోని మాలేనత్తం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే రైతుకు పట్టాదారు పాస్‌బుక్ జారీ కాలేదు. దీంతో వీఆర్వో రాజశేఖర్‌ని కలిశాడు. పాస్‌బుక్ జారీ కోసం రైతుని వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు వెంకటరమణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.


బుధవారం  రైతు నుంచి రూ.8,500 నగదు తీసుకుంటుండగా కార్యాలయంలో వీఆర్వోను రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల అదుపులో వీఆర్వో రాజశేఖర్ ఉన్నారు. ఈ ఘటన రెవెన్యూ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. 

Updated Date - 2021-03-17T22:39:01+05:30 IST